Tomato Price: మదనపల్లి మార్కెట్ లో టమాటా ధర భారీగా పతనం.. కిలో రూ. 2.. గిట్టుబాటు ధర లేక రైతన్న కన్నీరు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొత్తనమవుతున్న టమోటా ధరల ప్రయాణం కొనసాగుతూనే ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కిలో టమోటా ధర రూ. 4 నుంచి 10 లోపే పలుకుతున్న ధర దిగాలు కు కారణం అవుతోంది. లోని పడమటి ప్రాంతంలో దాదాపు 20వేల ఎకరాల్లో టమోటా సాగు చేసిన రైతాంగం ఇప్పుడున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తుంది.

Tomato Price: మదనపల్లి మార్కెట్ లో టమాటా ధర భారీగా పతనం.. కిలో రూ. 2.. గిట్టుబాటు ధర లేక రైతన్న కన్నీరు
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Sep 08, 2023 | 8:56 AM

భారతీయ వంటల్లో కూరగాయల్లో టమాటాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కూరగా మాత్రమే కాదు.. టిఫిన్స్ , పచ్చళ్లు, సూప్స్, వంటి వాటిల్లో కూడా ప్రధమ స్థానం టమాటాకు ఉంది. ఏపీలో చిత్తూరు జిల్లా టమాటా  సాగుకు పెట్టింది పేరు. అతి పెద్ద మార్కెట్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి లోనే ఉంది. మదనపల్లి మార్కెట్ నుంచి దేశ విదేశాలకు టమోటా ఎగుమతి కూడా అవుతుంది. అంతటి  ప్రాధాన్యత ఇక్కడ పండే టమోటా సాగుకు ఉంది. దీంతో ఇక్కడ ఎక్కడి నుంచో బయ్యర్లు ట్రేడర్లు మదనపల్లి మార్కెట్ కు టమోటా కొనుగోలు కోసం రావడం ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న తంతు. దీంతో మదనపల్లి టమోటా బిజినెస్ సెంటర్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే గత ఆగస్టు మొదటి వారం దాకా టమోటా రేట్ పీక్ రేట్ కు చేరడంతో మదనపల్లి మార్కెట్ షేర్ మార్కెట్ ను తలపించింది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. ఆగస్టు 14 నుంచి తగ్గు ముఖం పడుతూ వచ్చిన టమోటా ధరలు ఇప్పుడు ఏకంగా కనిష్ట ధర రూ. 4 గరిష్ట ధర రూ. 10 కు చేరుకుంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొత్తనమవుతున్న టమోటా ధరల ప్రయాణం కొనసాగుతూనే ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కిలో టమోటా ధర రూ. 4 నుంచి 10 లోపే పలుకుతున్న ధర దిగాలు కు కారణం అవుతోంది. లోని పడమటి ప్రాంతంలో దాదాపు 20వేల ఎకరాల్లో టమోటా సాగు చేసిన రైతాంగం ఇప్పుడున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. జిల్లాలోని మదనపల్లి, గుర్రంకొండ, కలకడ, పలమనేరు, వి కోట, వడ్డిపల్లి టమోటా మార్కెట్ లో పడిపోయిన ధరలు ఇలాగే కొనసాగితే పెట్టుబడులు కూడా రావని మదన పడుతోంది.

రోజుకు పతనమవుతున్న ధరలతో టమోటా రైతులు కుదేలవుతుంటే మరో వైపు బహిరంగ మార్కెట్ లో కిలో టమోటా ధర వినియోగదారుడికి రూ. 20 నుంచి 30 వ్యాపారులు కట్టబెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర అందక గగ్గోలు పెడుతుంటే వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు లాభపడుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టమోటా మార్కెట్ లో టమాటా కొనుగోలుకు ట్రేడర్లు లేకపోవడంతోనే రైతుకు రేటు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..