Andhra Pradesh: యూట్యూబ్‌లో చూసి ఎలక్ట్రిక్ బైక్ తయారుచేసిన యువకుడు.. మైలేజ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
కృషి వుంటే మనుషులు ఋషులౌతారు.. మహా పురుషులౌతారు అనే నానుడిని ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థి నిజం చేశాడు. తనకున్న చిన్నపాటి అవకాశాలతో తనలోని ప్రతిభకు సాంకేతికను జోడించి అద్భుత ఆవిష్కరణ చేసి గ్రామస్తుల మెప్పు పొందాడు. రోజు రోజుకీ పెట్రోల్ ధరలు ఆకాన్నంటుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు పెట్రోలు భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి సమస్యకు పరష్కారాన్ని చుపాలనే ఉద్దేశ్యంతో ఆ విద్యార్ది ఓ ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేయాలనుకున్నాడు.
కృషి వుంటే మనుషులు ఋషులౌతారు.. మహా పురుషులౌతారు అనే నానుడిని ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థి నిజం చేశాడు. తనకున్న చిన్నపాటి అవకాశాలతో తనలోని ప్రతిభకు సాంకేతికను జోడించి అద్భుత ఆవిష్కరణ చేసి గ్రామస్తుల మెప్పు పొందాడు. రోజు రోజుకీ పెట్రోల్ ధరలు ఆకాన్నంటుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు పెట్రోలు భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి సమస్యకు పరష్కారాన్ని చుపాలనే ఉద్దేశ్యంతో ఆ విద్యార్ది ఓ ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేయాలనుకున్నాడు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 60 నుండి 70 కిలోమీటర్లు నడిచే బైకును తయారు చేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం కొమ్మర గ్రామానికి చెందన మండా దిలీప్ కుమార్ దూభచర్ల లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. అయితే తాను 10 వ తరగతి వరకు ద్వారకాతిరుమల సాంస్కృతొన్నత పాఠశాలలో చదివాడు.
దిలీప్‌కు మెకానికల్ అంటే ఎక్కువ ఇష్టం. ఆ క్రమంలోనే స్కూల్లో చదువుతున్న రోజుల్లో సైన్స్ ఫెయిర్లో ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. వాటికి అవార్డులు సైతం పొందాడు. అయితే రోజురోజుకీ పెట్రోల్ ధర పెరిగిపోవడంతో బైక్‌ను వాడాలంటే సాధారణ ప్రజలకు కష్టతరంగా మారిందని భావించిన దిలీప్ కుమార్ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ బైక్ ను తక్కువ ధరలో తయారు చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా యూట్యూబ్లో ఎలక్ట్రిక్ బైక్ ఎలా తయారు చేయాలో.. వాటికి ఏ పరికరాలు కావాలో చూశాడు. ఓ పాత ప్లాటినా బైక్ ను స్క్రాప్ లో కొని, దానికి బ్యాటరీలు, ఇతర పనిముట్లు ఆన్లైన్లో కొని, దానికి అమర్చి ఎలక్ట్రికల్ బైక్ తయారు చేశాడు. అతను తయారుచేసిన ఎలక్ట్రికల్ బైక్ నాలుగు గంటలు సేపు ఛార్జింగ్ పెడితే సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది.
అయితే ఆ ఎలక్ట్రికల్ బైకు తయారు చేయడానికి దిలీప్ కుమార్‌కు అయిన ఖర్చు కేవలం 17 వేల రూపాయలు మాత్రమే. అంత తక్కువ ధరలో ఎలక్ట్రికల్ బైక్ తయారు చేయడంతో గ్రామస్తులతో పాటు మండల ప్రజలు దిలీప్ కుమార్‌ను అభినందిస్తున్నారు. అయితే తాను తయారుచేసిన ఎలక్ట్రికల్ బైక్ పై ముగ్గురు వ్యక్తులు ఈజీగా ప్రయాణించవచ్చని, ఒక చిన్న కుటుంబానికి ఈ బైక్ ఎంతగానో ఉపయోగపడుతుందని.. తాను ఎక్కడికి వెళ్లినా ఆ బైక్ మీద వెళుతున్నానని, ఈ బైక్ ముందుకే కాకుండా ప్రత్యేకంగా రివర్స్ కూడా ప్రయాణిస్తుందనీ దిలీప్ కుమార్ చెబుతున్నాడు. అయితే ప్రభుత్వం తన ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే.. రానున్న రోజుల్లో ఇలాంటి ఆవిష్కరణలు ఎన్నో తయారుచేస్తానని దిలీప్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..