Baby sale: గర్భంలోనే బిడ్డ.. అప్పుడే అమ్మకానికి పెట్టిన తల్లి..! వీడియో..
నిజామాబాద్ జిల్లాలో హృదయవిదాకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఆడపిల్లలున్న తల్లి పోషించే స్థోమత లేక తన బిడ్డను అమ్మకానికి పెట్టింది. శిశువును కొనుగోలు చేసిన ఇద్దరు మహిళల మధ్య పెంపకం విషయంలో గొడవ జరగడంతో విషయం పోలీసుల దాకా చేరింది. మధ్యవర్తిగా వ్యవహరించిన మహిళతో పాటు మొత్తం నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. రెండు రోజుల కింద పుట్టిన మగశిశువును గవర్నమెంట్చైల్డ్ కేర్ సెంటర్‌కు తరలించారు.
నిజామాబాద్ జిల్లాలో హృదయవిదాకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ఆడపిల్లలున్న తల్లి పోషించే స్థోమత లేక తన బిడ్డను అమ్మకానికి పెట్టింది. శిశువును కొనుగోలు చేసిన ఇద్దరు మహిళల మధ్య పెంపకం విషయంలో గొడవ జరగడంతో విషయం పోలీసుల దాకా చేరింది. మధ్యవర్తిగా వ్యవహరించిన మహిళతో పాటు మొత్తం నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. రెండు రోజుల కింద పుట్టిన మగశిశువును గవర్నమెంట్చైల్డ్ కేర్ సెంటర్‌కు తరలించారు. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గోసంగి దేవీకి ఇద్దరు ఆడపిల్లలు. మరోసారి గర్భం దాల్చింది. మళ్లీ కూతురు పుడుతుందని అనుమానించింది. పేదరికం అనుభవిస్తున్నందున పుట్టే బిడ్డను అమ్మాలని ఆశా వర్కర్సలూంకేజియాకు దేవి చెప్పింది. దీంతో సలూంకేజియా.. పిల్లులులేని హుమేరా బేగం, షబానా బేగంను సంప్రదించింది. మగపిల్లాడు పుడితే లక్షన్నర, ఆడపిల్ల పుడితే లక్ష రూపాయలు చెల్లించేలా ఇద్దరితోనూ బేరం కుదిర్చుకున్నారు. ముందస్తుగా చెరో 5 వేల రూపాయలు అడ్వాన్స్‌గా దేవీకి ఇచ్చారు. సెప్టెంబర్ 3న ఓ ప్రైవేటు హాస్పిటల్లో మగబిడ్డ పుట్టగా హాస్పిటల్ ఖర్చు 20 వేలను హుమేరా, షబానా చెల్లించి తల్లీబిడ్డను ఇంటికి చేర్చారు. మగపిల్లాడు కావడంతో హుమేరా, షబానా తమకంటే తామని గొడవపడ్డారు. విషయం పోలీసులకు తెలియడంతో స్పెషల్ టీం ద్వారా కూపీలాగగా అంతా బయటపడింది. శిశువును అమ్మే ప్రయత్నం చేసిన దేవీతో పాటు హుమేరా, షబానా, మధ్యవర్తిగా వ్యవహరించిన సలూంకేజియాను అరెస్టు చేశారు పోలీసులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

