TTD Good News: భక్తులకు బంపర్ ఆఫర్.. వారికి వీఐపీ స్పెషల్ దర్శనం.. మరిన్ని వివరాలు..
తిరుమల తిరుపతి దేవస్థానం రామకోటి తరహాలో 'గోవింద కోటి' అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటితరం యువతలో భక్తి భావాన్ని పెంచేందుకు, సనాతన ధర్మం గురించి విస్తృత ప్రచారం కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి తెలిపారు. అంతే కాదు 'గోవిందకోటి' రాసిన 25 ఏళ్లలోపు పిల్లలకు, యువతకు, వారి ఫ్యామిలీ మెంబర్స్కు తిరుమల కొండపై ఒకసారి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని అనౌన్స్ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం రామకోటి తరహాలో ‘గోవింద కోటి’ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటితరం యువతలో భక్తి భావాన్ని పెంచేందుకు, సనాతన ధర్మం గురించి విస్తృత ప్రచారం కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి తెలిపారు. అంతే కాదు ‘గోవిందకోటి’ రాసిన 25 ఏళ్లలోపు పిల్లలకు, యువతకు, వారి ఫ్యామిలీ మెంబర్స్కు తిరుమల కొండపై ఒకసారి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని అనౌన్స్ చేశారు. అదే విధంగా 10,01,116 సార్లు గోవిందనామాలు రాసిన వారికి శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తామని మంగళవారం తొలిసారి సమావేశమైన టీటీడీ నూతన ధర్మకర్తల మండలి ప్రకటించింది. అంతేకాక, ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఉచితంగా 20 పేజీలున్న కోటి భగవద్గీత పుస్తకాలు శ్రీవారి ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుబట్టారు. టీటీడీ చైర్మన్ గా, రాజకీయ నేతగా చెబుతున్నా.. సనాతన ధర్మం అంటే మతంకాదు. అది ఒక జీవనయానం. ప్రతి దేశానికి ఒక సంస్కృతి, సంప్రదాయం ఉంటుంది. వాటిని అర్ధం చేసుకోకుండా విమర్శించడం సరికాదు. ఇవి సమాజంలో అలజడిని సృష్టించడానికి పనికొస్తాయి తప్ప విమర్శించిన వాళ్లకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదు అని భూమన అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..