G20 Summit in Delhi: జి20 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు యూఎస్‌ నుంచి బయలుదేరిన బైడెన్..

G20 Summit in Delhi: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌లో జరుగుతున్న జి20 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు యూఎస్‌ నుంచి బయలుదేరారు. ప్రత్యేక విమానంలో ఇవాళ ఆయన భారత్‌కు చేరుకోనున్నారు. మన దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఈ జి20 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి వివిధ దేశాల ప్రతినిధులు హాజరవుతున్నాీరు. అంతకంటే ముందు.. జోబైడెన్‌కు కరోనా నెగెటివ్ అని తేల్చారు వైద్యులు.

G20 Summit in Delhi: జి20 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు యూఎస్‌ నుంచి బయలుదేరిన బైడెన్..
Joe Biden
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 08, 2023 | 5:42 AM

G20 Summit in Delhi: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌లో జరుగుతున్న జి20 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు యూఎస్‌ నుంచి బయలుదేరారు. ప్రత్యేక విమానంలో ఇవాళ ఆయన భారత్‌కు చేరుకోనున్నారు. మన దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఈ జి20 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి వివిధ దేశాల ప్రతినిధులు హాజరవుతున్నాీరు. అంతకంటే ముందు.. జోబైడెన్‌కు కరోనా నెగెటివ్ అని తేల్చారు వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఇక బైడెన్ భార్య జిల్ బైడెన్‌కు కూడా కరోనా నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

జిల్ బైడెన్‌కు కరోనా నెగెటివ్..

జో బైడెన్‌కు కరోనా నెగెటివ్..

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు..

సెప్టెంబర్ 9 నుండి 10 వరకు దేశ రాజధానిలో జరగనున్న G20 సమ్మిట్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతా తనిఖీలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దులో వాహనాలను తనిఖీలు చేస్తున్న భద్రతా సిబ్బంది.