Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థుల ఆత్మహత్యలను ఈ విధంగా నివారించవచ్చు.. మనఃస్థలి సంస్థ కీలక సూచనలు

రోజురోజుకు విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడం ఆందోళనకరంగా మారుతుంది. అయితే ఈ నేపథ్యంలో పాఠశాలల్లోని సమగ్ర మానసిక ఆరోగ్య పథకాలను అమలుచేసిన అవసరం కచ్చితంగా ఉందని మనఃస్థలి అనే సంస్థ పిలుపునిచ్చింది. వాస్తవానికి ఈ సంస్త మానసిక ఆరోగ్య సరంక్షణ కోసం నిరంతరం కృషి చేస్తోంది. అయితే ప్రస్తుత కాలంలో యువతీ యువకులు ఆత్మహత్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి.

విద్యార్థుల ఆత్మహత్యలను ఈ విధంగా నివారించవచ్చు.. మనఃస్థలి సంస్థ కీలక సూచనలు
A Girl
Follow us
Aravind B

|

Updated on: Sep 08, 2023 | 6:36 AM

రోజురోజుకు విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడం ఆందోళనకరంగా మారుతుంది. అయితే ఈ నేపథ్యంలో పాఠశాలల్లోని సమగ్ర మానసిక ఆరోగ్య పథకాలను అమలుచేసిన అవసరం కచ్చితంగా ఉందని మనఃస్థలి అనే సంస్థ పిలుపునిచ్చింది. వాస్తవానికి ఈ సంస్త మానసిక ఆరోగ్య సరంక్షణ కోసం నిరంతరం కృషి చేస్తోంది. అయితే ప్రస్తుత కాలంలో యువతీ యువకులు ఆత్మహత్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలోనే ఈ సంస్థ పలు కీలకమైన సూచనలు చేసింది. బాధాకరమైన విద్యార్థి ఆత్మహత్యల సమస్య పరిష్కరానికి తక్షణమే క్రియాశీలక చర్యలు తీసుకోవాలని అడుగుతోంది. అలాగే పాఠశాలల్లో సురక్షితమైన సహాయక వాతావరణాన్ని వెంటనే మెరుగుపరచాలని పెంపొందించాలని సూచనలు చేస్తోంది. ముఖ్యంగా చదువుల ఒత్తిడి, సామాజిక సంబంధాలు, డిజిటల్ యుగ సవాళ్లు.. యువతుల హృదయాల్లో సంక్షోభానికి కారణమవుతున్నాయి.

అయితే వీరి ఆత్మహత్యలు సమాజాన్ని కలిచివేస్తున్నాయని.. ఈ మనఃస్థలి సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అందుకోసమే ఇలాంటి విషాదకమైన సంఘటనలను అడ్డుకుని.. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో స్కూల్స్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయనేది తమకు బలంగా నమ్మకం ఉందని మనఃస్థలి సంస్థ చెప్పింది. అయితే ఇందుకోసం.. ఆరు సూత్రాల ప్రణాళికలను ఈ సంస్థ సిఫార్సు చేసింది. అయితే దీని ప్రకారం చూసుకుంటే.. మానసిక ఆరోగ్య పథకాలను ప్రభుత్వ, అలాగే ప్రైవేటు పాఠశాలలు అమలు చేసేందుకు చొరవ చూపాలి. బహిరంగ చర్చల పెట్టి విద్యార్థులు ఎలాంటి జంకు లేకుండా.. వారి ఆలోచనలను, ఆందోళనలను వెలిబుచ్చేందుకు సైతం అవకాశాలు కల్పించాల చర్యలు తీసుకోవాలి. అయితే విద్యార్థుల మానసిక సమస్యలను ముందుగానే గుర్తించి సకాలంలో పరిష్కారం చూపగలిగేలా పాఠశాలలు సిద్ధం కావాలని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇండియాలో ప్రతి లక్ష మంది విద్యార్థులకు ఒక మానసిక ఆరోగ్య నిపుణుడు ఉన్నారు. కానీ వీరి కౌన్సెలింగ్ ఫీజు చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. దీంతో విద్యార్థులు వారి సేవలను వినియోగించుకోలేకపోతున్నారు. జాతీయ నేర గణాంకాల విభాగం చూసుకుంటే ఇండియాలో… రోడ్డు ప్రమాదాలు.. ఆత్మహత్యల ద్వారా ప్రతి సంవత్సం 13వేల మందికి పైగా విద్యార్థులు చనిపోతున్నారు. అంటే రోజుకు 35 మంది మృత్యూవాతపడుతున్నారన్న మాట. అయితే 2018లో ఆయుష్మాన్ భారత్ అనే పథకం కేంద్ర ప్రభుత్వం పాఠశాలల ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఎల్లప్పుడు ఉండే సంప్రదాయ విద్యా కార్యక్రమాలకు మించి.. యువతను ఉల్లాసపరిచే కార్యచరణ కూడా ఎంతో అవసరమని నిపుణలు సూచిస్తున్నారు. అలాగే విద్యార్థులపై మద్దతు, సానుభూతితో కూడినటువంటి సంస్కృతిని పెంపొందించడం వల్ల విద్యాలయాలు సంరక్షణ కేంద్రాలుగా మారుతాయని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆత్మహత్యలను నివారించవచ్చని అంటున్నారు.