AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pandu Master : నాన్న ఆటో డ్రైవర్.. సొంత ఇల్లు కూడా లేదు.. పండు మాస్టార్ నెల సంపాదన ఎంతంటే..

తెలుగు బుల్లితెరపై 'ఢీ' (Dhee) డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా విశేష గుర్తింపు పొందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్. తనదైన డ్యాన్స్ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో పాల్గొన్నారు. ప్రస్తుతం కెరీర్ మంచి బిజీగా ఉన్న సమయంలోనే ఇటీవల ఆయన ఒక తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

Pandu Master : నాన్న ఆటో డ్రైవర్.. సొంత ఇల్లు కూడా లేదు.. పండు మాస్టార్ నెల సంపాదన ఎంతంటే..
Pandu Master
Rajitha Chanti
|

Updated on: Jun 12, 2026 | 11:14 AM

Share

పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ పండు (ఢీ పండు). తన డ్యాన్స్ తోపాటు.. తన కామెడీతోనూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ ఇటీవల కొన్ని రోజుల క్రితం విశాఖపట్నంలోని ఆనందపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన రెండు కాళ్లు విరిగిపోయాయి. వెంటనే విశాఖలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. ఆయనకు రెండు శస్త్రచికిత్సలు చేశారు వైద్యులు. పండు మాస్టార్ పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పడుతుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే.. గతంలో ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సంపాదన, కుటుంబం గురించి పండు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరించిన ఒక టాక్ షోలో పాల్గొన్న ఆయన, తన తండ్రి పడుతున్న కష్టం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

ఎక్కువమంది చదివినవి : Sridevi Vijaykumar : ఇప్పుడున్న హీరోలలో అతడంటే పిచ్చి ఇష్టం.. అతడే నా ఫేవరేట్.. హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్..

ఢీ షో ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నప్పటికీ, తనకు ఇప్పటివరకు సొంత ఇల్లు లేదని పండు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వైజాగ్ లో కూడా తనకు ఇల్లు లేదని, తన భవిష్యత్తు అనేది రాసిపెట్టిన రాతపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. తనకు వచ్చిన సంపాదననంతా తన తల్లిదండ్రుల కోసమే ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. ఒకప్పుడు తన పేరెంట్స్ ఎంజాయ్ చేయలేని ఐమాక్స్ థియేటర్లు, లగ్జరీ లైఫ్ ను ఇప్పుడు తన డబ్బుతో వాళ్లకు చూపిస్తున్నానని, అదే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. తన తండ్రి ఒక ఆటో డ్రైవర్ అని, తాను ఇంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా ఆయన ఇప్పటికీ అదే ఆటోను నడుపుతున్నారని పండు తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

ఆ ఆటో కొని దాదాపు 20 ఏళ్లు దాటిపోయిందని, సర్వీస్ అయిపోయినా సరే ఆయన దాన్ని వదలడం లేదని చెప్పారు. “నా కొడుకు సంపాదనతో కొన్న మొదటి ఆటో ఇది, నేనిదే నడుపుకుంటా” అని తన తండ్రి అంటుంటారని, నెలకు రూ. 15,000 నుండి రూ. 20,000 ఖర్చయినా దానికి రిపేర్లు చేయించుకుని మరీ అదే ఆటోను వాడుతున్నారని పండు భావోద్వేగానికి గురయ్యారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

ఎక్కువమంది చదివినవి : Jai Chiranjeeva: చిరంజీవి మేనకోడలు ఇంత మారిపోయింది మావా.. ? గ్లామరస్ లుక్కులో అదిరిపోయిన జై చిరంజీవి చైల్డ్ ఆర్టిస్ట్..

Follow Us