నటి కాకముందు.. డబ్బు కోసం  అంత కష్టపడిందా ఈ ముద్దుగుమ్మ

22-07-2026

Pic credit - Instagram

Phani Ch

 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శివాని నాగరం.

 తొలి సినిమాతోనే తన సహజసిద్ధమైన నటనతో అందరినీ ఆకట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది శివాని. ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంత ప్రతిభతో తనకంటు ఒక గుర్తిపు తెచ్చుకుంది.

 హీరోయిన్ కాకముందు ఆమె పడిన కష్టం, అనుభవించిన పరిస్థితులు ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉన్న శివాని..  కూచిపూడిలో శిక్షణ తీసుకుని వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ నర్తకిగా తన ప్రయాణాన్ని ఎంతో ఉత్సాహంగా ప్రారంభించింది.

డాన్స్ మాత్రమే కాకుండా సంగీతంపై కూడా ఆమెకు మంచి పట్టు ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పరిశ్రమలోకి రాకముందు రకరకాల ఈవెంట్లలో చురుగ్గా పాల్గొనేది.

 సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే శివాని ఇళ్లలో జరిగే చిన్న చిన్న పెళ్లిళ్లు, శుభకార్యాలు మరియు లైవ్ బ్యాండ్ ఈవెంట్లలో పాటలు పాడుతూ, తన ప్రతిభను చాటుకునేది.

ఎలాంటి వేదికైనా చిన్నది అని అనుకోకుండా, తనకు లభించిన ప్రతి అవకాశాన్ని క్రమశిక్షణతో ఉపయోగించుకుంటూ కళపట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకుంది.