AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Finance: బ్యాంక్ లోన్ తీసుకుని బంగారం కొంటున్నారా? ఇది తెలివైన నిర్ణయమేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Personal Finance: మీరు భవిష్యత్తు లాభాల కోసం బంగారం కొనాలనుకుంటే, పర్సనల్ లోన్ జోలికి అస్సలు వెళ్లకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే బంగారంపై వచ్చే రాబడి కంటే మీరు లోన్‌కు కట్టే వడ్డీనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టాలని భావిస్తే, ఫిజికల్ గోల్డ్ (ఆభరణాలు) కంటే ఈ కింది ఆప్షన్లు ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Personal Finance: బ్యాంక్ లోన్ తీసుకుని బంగారం కొంటున్నారా? ఇది తెలివైన నిర్ణయమేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?
Bank Loan Gold Buying
Subhash Goud
|

Updated on: Jun 12, 2026 | 11:01 AM

Share

Personal Finance: ప్రస్తుత రోజుల్లో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ బంగారం ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అయితే ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ ఇంకా భారీగానే ఉందని చెప్పాలి. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు పసిడిని కొనడం ఒక పెద్ద భారంగా మారింది. అయినప్పటికీ మనదేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనడం అనేది ఒక సెంటిమెంట్ మరియు తప్పనిసరి ఆచారం. ఇందుకోసం చాలామంది బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్స్ తీసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. మరి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే బ్యాంకు నుంచి రుణం తీసుకుని బంగారం కొనడం మంచిదేనా? ఇలా అప్పు చేసి బంగారం కొనడం ఎంతవరకు కరెక్ట్? ఇది తెలివైన నిర్ణయమేనా? ఈ విషయంపై ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

పర్సనల్ లోన్‌తో బంగారం:

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పర్సనల్ లోన్ తీసుకుని బంగారు ఆభరణాలు కొనడం అస్సలు తెలివైన నిర్ణయం కాదు. అత్యవసర పరిస్థితుల్లో పెళ్లిళ్ల వంటి అనివార్య కారణాల వల్ల అయితే రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు తక్కువ మొత్తంలో రుణం తీసుకోవచ్చు. కానీ, పెద్ద మొత్తంలో లోన్ తీసుకుని బంగారం కొనడం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసే ప్రమాదం ఉంది. బ్యాంక్ పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఇవి 15% నుండి 25% వరకు ఉంటాయి. దీనివల్ల మీరు ప్రతి నెల చెల్లించాల్సిన EMI భారం భారీగా పెరుగుతుంది.

పెట్టుబడి కోసమైతే అస్సలు వద్దు:

మీరు భవిష్యత్తు లాభాల కోసం బంగారం కొనాలనుకుంటే, పర్సనల్ లోన్ జోలికి అస్సలు వెళ్లకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే బంగారంపై వచ్చే రాబడి కంటే మీరు లోన్‌కు కట్టే వడ్డీనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టాలని భావిస్తే, ఫిజికల్ గోల్డ్ (ఆభరణాలు) కంటే ఈ కింది ఆప్షన్లు ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గోల్డ్ ఈటీఎఫ్‌లు (Gold ETFs): షేర్ మార్కెట్ తరహాలోనే వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఆభరణాలలాగా వీటికి తరుగు, మజూరీ (Making Charges) వంటి అదనపు ఖర్చులు ఉండవు. డిజిటల్ గోల్డ్ (Digital Gold): ప్రస్తుతం అనేక పేమెంట్ యాప్స్‌లో డిజిటల్ గోల్డ్ అందుబాటులో ఉంది. ఇందులో మీరు కేవలం ఒక్క రూపాయి నుంచి కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. భద్రత పరంగా కూడా ఇది చాలా సురక్షితం. శుభకార్యాలకు తప్పనిసరి అయితే తప్ప, కేవలం పెట్టుబడి లేదా ఆడంబరం కోసం భారీ వడ్డీలకు పర్సనల్ లోన్స్ తీసుకుని బంగారాన్ని కొనకపోవడమే మీ ఆర్థిక ఆరోగ్యానికి మంచిది.

ఇది కూడా చదవండి: Gold Price Today: రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us