AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీకటి పడితే చాలు వాడు ఊర్లోకి వచ్చేస్తాడు! బిక్కు బిక్కుమంటున్న గ్రామస్తులు..?

హనుమకొండ జిల్లాలోని ఓ గ్రామాన్ని గత నాలుగు రోజుల నుండి ఎలుగుబంటి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. చీకటి పడగానే గ్రామంలోకి ప్రవేశిస్తున్న ఎలుగుబంటి అక్కడి ప్రజలను వనికిస్తుంది..అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఎలుగుబంటి దాడిలో ఎవరికి ఎలాంటి హానీ జరగకపోవడంతో ఊరంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఎలాంటి ముప్పుపొంచి ఉందో అనే భయం భయంతో వణికి పోతున్నారు. ఎలుగుబంటి నుండి తమ ప్రాణాలు రక్షించాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు..

చీకటి పడితే చాలు వాడు ఊర్లోకి వచ్చేస్తాడు! బిక్కు బిక్కుమంటున్న గ్రామస్తులు..?
Suraram Village Bear
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jun 12, 2026 | 10:33 AM

Share

హనుమకొండ జిల్లాలోని ఓ గ్రామంలో గత కొన్ని రోజులుగా ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ఒక ఎలుగుబంటి పగలు, రాత్రి తేడా లేకుండా తిరుగుతూ స్థానిక ప్రజలను వణకిస్తోంది. గత నాలుగు రోజులుగా ఈ భయానక వాతావరణం కొనసాగుతుండటంతో, గ్రామస్తులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. సూరారం గ్రామ శివారులో ఉన్న గుట్టల నుండి ఈ ఎలుగుబంటి గ్రామంలోకి ప్రవేశిస్తోంది. ముఖ్యంగా చీకటి పడగానే ఇది జనావాసాల్లోకి వస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికి జంకుతున్నారు. ఎలుగుబంటిని ప్రత్యక్షంగా చూసిన పలువురు గ్రామస్తులు భయంతో హడలిపోతున్నారు. అది ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో, ఎవరి ప్రాణాలు తీస్తుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఒక పశువుల కాపరికి ఈ ఎలుగుబంటి ఎదురైంది. అయితే, అతను అప్రమత్తంగా వ్యవహరించడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఎలుగుబంటి దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం, ప్రాణనష్టం జరగకపోవడంతో ఊరంతా కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ, పొంచి ఉన్న ముప్పును తలచుకుని భయంతో వణికిపోతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎలుగుబంటి సంచారంపై సూరారం గ్రామస్తులు ఇప్పటికే అటవీశాఖ (Forest Department) అధికారులకు సమాచారం అందించారు. ఈ భల్లూకం తమ ప్రాణాలను బలితీసుకోక ముందే అధికారులు తక్షణమే స్పందించాలని వారు వేడుకుంటున్నారు. గ్రామంలో రక్షణ చర్యలు చేపట్టాలని, బోన్లు ఏర్పాటు చేసి ఎలుగుబంటిని సురక్షితంగా పట్టుకోవాలని కోరుతున్నారు. బంధించిన ఎలుగుబంటిని సమీపంలోని జంతు సంరక్షణ కేంద్రానికి లేదా దట్టమైన అడవిలోకి తరలించి, తమకు భయం లేని జీవితాన్ని ప్రసాదించాలని సూరారం గ్రామ ప్రజలు అధికారులను గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు