పాఠశాల స్పోర్ట్స్‌ ప్రాక్టీస్ సెషన్‌లో విషాదం.. జావెలిన్‌ కర్ర తలలో గుచ్చుకుని విద్యార్ధి మృతి!

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఓ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల మైదానంలో స్పోర్ట్స్‌ ప్రాక్టీస్ సెషన్‌లో ప్రమాదవశాత్తు జావెలిన్‌ తలకు తగిలి ఓ విద్యార్ధి మృతి చెందాడు. మరో విద్యార్థి విసిరిన జావెలిన్ ప్రమాదవశాత్తు తలలోకి దూసుకుపోవడంతో 15 ఏళ్ల బాలుడు..

పాఠశాల స్పోర్ట్స్‌ ప్రాక్టీస్ సెషన్‌లో విషాదం.. జావెలిన్‌ కర్ర తలలో గుచ్చుకుని విద్యార్ధి మృతి!
School Boy Dies After Javelin Pierces His Head
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 07, 2023 | 6:36 PM

ముంబాయి, సెప్టెంబర్ 7: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఓ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల మైదానంలో స్పోర్ట్స్‌ ప్రాక్టీస్ సెషన్‌లో ప్రమాదవశాత్తు జావెలిన్‌ తలకు తగిలి ఓ విద్యార్ధి మృతి చెందాడు. మరో విద్యార్థి విసిరిన జావెలిన్ ప్రమాదవశాత్తు తలలోకి దూసుకుపోవడంతో 15 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ విషాద ఘటన మ‌హారాష్ట్ర‌లోని రాయిగ‌డ్ జిల్లాలో గురువారం (సెప్టెంబర్‌ 7) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మ‌హారాష్ట్ర‌లోని రాయిగ‌డ్ జిల్లా మంగావ్ తాలూకాలోని గోరేగావ్‌లోని పురార్‌లోని ఐఎన్‌టి ఇంగ్లిష్ మీడియం స్కూల్‌ మైదానంలో గురువారం మధ్యాహ్నం విద్యార్ధులు జావెలిన్ త్రోయింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మ‌న్‌గావ్ తాలూకా స్థాయి ఆటలకు విద్యార్ధులు సిద్ధమవుతున్నారు. జావెలిన్ టీమ్‌లో హుజెఫా దావేర్ (15) అనే స్టూడెంట్‌ కూడా ఉన్నాడు. ప్రాక్టీస్‌ సెషన్ జరుగుతుండగా మరో విద్యార్ధి జావెలిన్‌ విసిరాడు. అదేసమయంలో హుజెఫా దావేర్ తన షూలేస్‌ను కట్టుకోవడానికి కిందికి వంగాడు. అటుగా విసిరిన జావెలిన్‌ కర్రను దావేర్‌ గమనించలేదు. దీంతో కర్ర చివర ఉన్న పదునైన భాగం నేరుగా దావేర్‌ తలలో నుంచి దూసుకుపోయింది. ఈ ఘటనలో దావేర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తల భాగం నుంచి తీవ్ర రక్తస్రావం అయ్యి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే బాలుడు మరణించాడు. దీనిపై సమాచారం అందుకున్న గోరేవాగ్ పోలీసులు కేసు రిజిస్ట‌ర్ చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.

జావెలిన్ తలకు గుచ్చుకోవడంతో దావేర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన విద్యార్థిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. జిల్లాలోని గోరేగావ్ పోలీసులు ప్రస్తుతానికి ప్రమాదవశాత్తు జరిగిన మృతి కింద కేసు నమోదు చేశారు. ఒకవేళ జావెలిన్ విసిరిన విద్యార్థి నిర్లక్ష్యంగా కావాలనే దావేర్‌పై విసిరాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిని పరిశీలించేందుకు పాఠశాలలో అమర్చిన సీసీటీవీ కెమెరాలు, పాఠశాల మైదానంలోని దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు ఓ పోలీసధికారి మీడియాకు తెలిపాడు. మ‌న్‌గావ్ తాలూకాలోని ఐఎన్టీ ఇంగ్లీష్ స్కూల్‌లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న స్థానికంగా కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.