Dinner Plate Sized Inside Woman: ప్రసవం కోసం వెళ్తే మహిళ కడుపులో ప్లేట్‌ పెట్టి కట్లు వేసిన డాక్టర్లు.. మరీ ఇంత నిర్లక్షమా?

సాధారణంగా డాక్టర్లు ఆపరేషన్‌ చేసే సమయంలో దూది, కత్తెర వంటివి కడుపులో మరిచిపోయి కుట్లు వేయడం మనం చాలా సార్లు విన్నాం. కానీ ఈ డాక్టర్‌ మాత్రం మతిమరుపులో గజినీని మించిపోయేలా ఉన్నాడు. ఆపరేషన్‌ చేసి మహిళ కడుపులో ఏకంగా కంచం మరచిపోయాడు. అదేంటి.. అని అనుకుంటున్నారా? అవునండీ.. ప్రసవం కోసం వెళ్లిన..

Dinner Plate Sized Inside Woman: ప్రసవం కోసం వెళ్తే మహిళ కడుపులో ప్లేట్‌ పెట్టి కట్లు వేసిన డాక్టర్లు.. మరీ ఇంత నిర్లక్షమా?
Dinner Plate Sized Inside Woman
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 06, 2023 | 4:46 PM

న్యూజిలాండ్‌, సెప్టెంబర్ 6: సాధారణంగా డాక్టర్లు ఆపరేషన్‌ చేసే సమయంలో దూది, కత్తెర వంటివి కడుపులో మరిచిపోయి కుట్లు వేయడం మనం చాలా సార్లు విన్నాం. కానీ ఈ డాక్టర్‌ మాత్రం మతిమరుపులో గజినీని మించిపోయేలా ఉన్నాడు. ఆపరేషన్‌ చేసి మహిళ కడుపులో ఏకంగా కంచం మరచిపోయాడు. అదేంటి.. అని అనుకుంటున్నారా? అవునండీ.. ప్రసవం కోసం వెళ్లిన మహిళకు సిజేరియన్‌ చేసి బిడ్డను తీశాడు. ఆనక కుట్లు వేసే సమయంలో కడుపులో ఏకంగా పళ్లెం పెట్టి కుట్లు వేసేశాడు. ఈ విచిత్ర ఘటన న్యూజిలాండ్‌లో వెలుగు చూసింది.

న్యూజిలాండ్ హెల్త్ అండ్ డిసేబిలిటీ కమీషనర్ సోమవారం (సెప్టెంబర్‌ 4) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2020లో ఆక్లాండ్‌ సిటీ హాస్పిటల్‌కి ప్రసవ వేదనతో 20 యేళ్ల వయసున్న ఓ మహిళ వెళ్లింది. అక్కడి వైద్యులు సిజేరియన్‌ చేసి బిడ్డకు పురుడుపోశారు. తల్లీబిడ్డ క్షమంగానే ఉన్నారు. ఐతే ఆపరేషన్‌ చేసే సమయంలో 17 సెంటీమీటర్ల (6 అంగుళాలు) అలెక్సిస్ రిట్రాక్టర్ (స్థూపాకార పరికరం) అనే పరికరాన్ని పెట్టి కుట్లు వేశారు. ఆ తర్వాత మహిళను డిశ్చార్జ్ చేసి పంపించేశారు. ఐతే ఆ తర్వాత మహిళకు తరచూ కడుపునొప్పితో బాధపడుతుండేది. దీర్ఘకాలిక కడుపునొప్పితో బాధపడుతోన్న మహిళ వైద్యుల వద్దకు వెళ్లింది. వాళ్లు ఎక్స్‌రేతో సహా పలు పరీక్షలు చేశారు. ఎన్నో రకాల మందులు కూడా ఇచ్చారు. కానీ ఫలితం లేకపోయింది. చివరికి సీటీ స్కాన్‌లో అసలు విషయం బయటపడింది. మహిళ కడుపులో 18 నెలలుగా ఏడబ్ల్యూఆర్‌ అనే ముడుచుకునే స్థూపాకార పరికరం ఉన్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆమె కడుపులో ప్లేట్‌ పరిమాణంలో ఉన్న ఓ పరికరం ఉన్నట్లు డాక్టర్లు బాధిత మహిళకు తెలిపారు. దీంతో 18 నెలల క్రితం తనకు సిజేరియన్‌ జరిగిందని, ఆ తర్వాత తనకు ఎలాంటి ఆపరేషన్‌ జరగలేదని డాక్టర్లకు తెల్పింది. ఐతే తనకు తరచుగా కడుపునొప్పి వచ్చేదని ఎందుకు వచ్చేదో తనకు తెలియదని చెప్పుకొచ్చింది. దీంతో డాక్టర్లు జరిగింది ఏమిటో ఊహించగలిగారు.

వెంటనే ఆపరేషన్ చేసి మహిళ కడుపులోని పరికరాన్ని బయటికి తీశారు. దానిని సిజేరియన్ చేసే సమయంలో డాక్టరు వినియోగించే పరికరాల్లో అలెక్సిస్ రిట్రాక్టర్ అనే పరికరంగా గుర్తించారు. అది చూడటానికి డిన్నర్ ప్లేట్‌ పరిమాణంలో ఉంది. ఈ సంఘటన 2021లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన నివేదిక సోమవారం విడుదలవగా న్యూజిలాండ్ హెల్త్‌ కమీషనర్ మోరాగ్ మెక్‌డోవెల్.. టె వాటు ఓరా ఆక్లాండ్, ఆక్లాండ్ డిస్ట్రిక్ట్ హెల్త్ బోర్డ్ రోగి హక్కుల నియమావళిని ఉల్లంఘించినట్లు వెల్లడించారు. మహిళకు సిజేరియన్‌ చేసే సమయంలో అశ్రద్ధ వహించినట్లు గుర్తించింది. బాధిత మహిళకు ఆసుపత్రి యాజమన్యం భేషరతుగా క్షమాపణలు చెప్పాలని మెక్‌డోవెల్ ఆక్లాండ్ డిస్ట్రిక్ట్ హెల్త్ బోర్డ్ నివేదికలో ఆదేశించింది. ఈ మేరకు కేసును ప్రొసీడింగ్స్ డైరెక్టర్‌కి రిఫర్ చేశారు. డాక్టర్లు ఆపరేషన్ చేసే సమయంలో దూది, కత్తెర వంటి మర్చిపోతుంటారని విన్నాం గానీ మరీ ప్లేట్‌ మర్చిపోయేంత నిర్లక్ష్యంగా ఉంటారా అనేలా ఉందీ సంఘటన.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!