G20 Summit: జీ20 సమ్మిట్‌కు ముందు పీఎం బిజీబిజీ.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..

PM Narendra Modi: ఈ పర్యటనలో నరేంద్ర మోడీ ఆసియాన్ సభ్య దేశాలతో అంటే ఆగ్నేయాసియా దేశాల సంఘంతో వాణిజ్యం, భద్రత వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ASEAN దేశాలలో UPI ప్రారంభాన్ని సమ్మిట్ సమయంలో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఆసియాన్‌లో మలేషియా, ఇండోనేషియా, మయన్మార్, వియత్నాం, కంబోడియా, ఫిలిప్పీన్స్, బ్రూనై, థాయిలాండ్, లావోస్, సింగపూర్ ఉన్నాయి.

G20 Summit: జీ20 సమ్మిట్‌కు ముందు పీఎం బిజీబిజీ.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..
Pm Narendra Modi
Follow us
Venkata Chari

| Edited By: Ravi Kiran

Updated on: Sep 06, 2023 | 7:23 PM

ఆసియాన్-భారత్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ సాయంత్రం ఇండోనేషియా వెళ్లనున్నారు. సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు కేవలం 3 రోజుల ముందు ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఇండోనేషియా రాజధాని జకార్తాలో పర్యటించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా, ఈరోజు మంత్రుల మండలి సమావేశంతో పాటు మధ్యాహ్నం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. జకార్తా పర్యటనకు ముందు రాత్రి 7:30 గంటల వరకు తిరిగి సమావేశాలు నిర్వహించనున్నారు.

ఆ తర్వాత రాత్రి 8 గంటలకు పీఎం మోడీ జకార్తాకు బయలుదేరి, సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు జకార్తా చేరుకుంటారు. గురువారం ఉదయం 7 గంటలకు మోడీ ఆసియాన్ ఇండియా శిఖరాగ్ర సదస్సు వేదికకు చేరుకుని, సమ్మిట్‌లో పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఉదయం 8:45 గంటలకు ఆయన తూర్పు ఆసియా సదస్సులో పాల్గొంటారు. సమావేశం ముగిసిన తర్వాత పీఎం మోడీ ఉదయం 11:45 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరుతారు. సాయంత్రం 6:45 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.

సెప్టెంబరు 8న ప్రధానమంత్రి 3 దేశాలతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు బిడెన్‌తో సమావేశం కూడా ఉంటుందని దేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

వాణిజ్యం, భద్రతలపై చర్చ..

ఈ పర్యటనలో నరేంద్ర మోడీ ఆసియాన్ సభ్య దేశాలతో అంటే ఆగ్నేయాసియా దేశాల సంఘంతో వాణిజ్యం, భద్రత వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ASEAN దేశాలలో UPI ప్రారంభాన్ని సమ్మిట్ సమయంలో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఆసియాన్‌లో మలేషియా, ఇండోనేషియా, మయన్మార్, వియత్నాం, కంబోడియా, ఫిలిప్పీన్స్, బ్రూనై, థాయిలాండ్, లావోస్, సింగపూర్ ఉన్నాయి.

సెప్టెంబరు 5 నుంచి ప్రారంభమైన ఆసియాన్ సదస్సు సెప్టెంబర్ 8 వరకు కొనసాగనుంది. సెప్టెంబర్ 6-7 తేదీల్లో జరిగే ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు.

ఇండో-పసిఫిక్ ఫోరమ్‌లోనూ..

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, 2022-23లో భారత్, ఆసియాన్ దేశాల మధ్య రూ. 10 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గతంలో 9 ఆసియాన్ సదస్సుల్లో పాల్గొన్నారు. ఈసారి ఆసియాన్ సదస్సు సందర్భంగా ఇండోనేషియా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ఇండో పసిఫిక్ ఫోరమ్ అని పేరు పెట్టారు. ఈ ఫోరమ్ ద్వారా, ఆసియాన్ దేశాలు ఇండో-పసిఫిక్‌లో తమ లక్ష్యాల గురించి అభిప్రాయాన్ని తెలియజేస్తాయి. ఇందులో ఇండో-పసిఫిక్‌లో ఆసియాన్ దేశాల కనెక్టివిటీని పెంచడంపై చర్చలు జరగనున్నాయి.

నిజానికి ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా జోక్యం పెరుగుతుండటంపై చాలా కాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాకు సంబంధించి ఏదైనా ప్రకటన విడుదల చేస్తారా అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను అడిగినప్పుడు, విదేశాంగ తూర్పు వ్యవహారాల కార్యదర్శి సౌరభ్ కుమార్ మాట్లాడుతూ – అక్కడ ఏం చర్చిస్తారో ఇప్పుడే ఊహించడం కష్టం. అయితే, సామూహిక ఆందోళన సమస్యలపై చర్చ సాధ్యమేనంటూ బదులిచ్చారు.

ఆసియాన్ దేశాలతో భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (CSP) గత ఏడాది మాత్రమే సంతకం చేసింది. దీంతో ప్రధాని మోదీ పర్యటన అత్యంత కీలకమైంది. నిజానికి, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయి. దీని కింద, రక్షణ, ఆర్థిక, సాంకేతిక ప్రయోజనాలను పెంపొందించడానికి కలిసి పని చేయనున్నాయి. అదే సమయంలో ఈ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవడానికి భారతదేశం ఆసియాన్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..