Biscuit: ప్యాకెట్‌లో ‘ఒక్క బిస్కెట్‌’ తక్కువగా ఉందనీ కన్‌జ్యూమర్‌ ఫోరంలో ఫిర్యాదు.. కంపెనీకి ఏకంగా రూ.లక్ష జరిమానా.. 

బిస్కెట్‌ ప్యాకెట్‌పై నిర్దేశించిన విధంగాకాకుండా ప్యాకెట్‌లో బిస్కెట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో సదరు బిస్కెట్‌ కంపెనీపై ఓ వినియోగదారుడు కన్‌జ్యూమర్‌ ఫోరం (వినియోగదారుల ఫోరం)లో ఫిర్యాదు చేశాడు. బిస్కెట్‌ ప్యాకెట్‌పై సూచించిన సంఖ్య కంటే ఒకటి తక్కువగా ఉండటాన్ని కన్‌జ్యూమర్‌ ఫోరం తీవ్రంగా పరిగణించింది. వినియోగదారులను మోసం చేయడాన్ని తప్పుపట్టింది. దీంతో ఫిర్యాదు దారుడికి ఏకంగా..

Biscuit: ప్యాకెట్‌లో 'ఒక్క బిస్కెట్‌' తక్కువగా ఉందనీ కన్‌జ్యూమర్‌ ఫోరంలో ఫిర్యాదు.. కంపెనీకి ఏకంగా రూ.లక్ష జరిమానా.. 
One Biscuit Less Than In Packet
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 06, 2023 | 7:59 PM

చెన్నై, సెప్టెంబర్ 6: బిస్కెట్‌ ప్యాకెట్‌పై నిర్దేశించిన విధంగాకాకుండా ప్యాకెట్‌లో బిస్కెట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో సదరు బిస్కెట్‌ కంపెనీపై ఓ వినియోగదారుడు కన్‌జ్యూమర్‌ ఫోరం (వినియోగదారుల ఫోరం)లో ఫిర్యాదు చేశాడు. బిస్కెట్‌ ప్యాకెట్‌పై సూచించిన సంఖ్య కంటే ఒకటి తక్కువగా ఉండటాన్ని కన్‌జ్యూమర్‌ ఫోరం తీవ్రంగా పరిగణించింది. వినియోగదారులను మోసం చేయడాన్ని తప్పుపట్టింది. దీంతో ఫిర్యాదు దారుడికి ఏకంగా లక్ష రూపాయలు చెల్లించాలని బిస్కెట్‌ కంపెనీని ఆదేశించింది. ఆ బ్యాచ్‌ బిస్కెట్‌ ప్యాకెట్ల విక్రయాలను కూడా నిలిపివేయాలని పేర్కొంది.

సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్‌ ప్యాకెట్‌పై 16 బిస్కెట్ల సంఖ్య ఉంది. కానీ అందులో కేవలం 15 బిస్కెట్లు మాత్రమే ఉన్నాయని ఆరోపిస్తూ చెన్నైకి చెందిన డిల్లిబాబు అనే వ్యక్తి స్థానిక డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెస్సల్ ఫోరంలో ఫిర్యాదు చేశాడు. అక్రమ వ్యాపార పద్ధతులకు అవలంబిస్తున్నారని, సేవలో లోపాలున్నాయని పేర్కొంటూ సదరు బిస్కెట్‌ కంపెనీపై రూ.వంద కోట్ల జరిమానా విధించాలని తన ఫిర్యాదులో కోరాడు. అంతేకాకుండా తనకు రూ.10 కోట్ల పరిహారం కూడా చెల్లించేలా ఆదేశించాలంటూ పేర్కొన్నాడు. దీనిపై బిస్కెట్‌ తయారీ సంస్థ వాదన మరోలా ఉంది. బిస్కెట్ల బరువును బట్టి విక్రయిస్తామని, బిస్కెట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవద్దని ఫిర్యాదు దారుడి వాదనలతో విభేదించింది. తూనికలు కొలతల శాఖ నిబంధనలకు లోబడే ప్యాకెట్‌ బరువు ఉందని, అందులో ఎటువంటి మోసం లేదని తయారీ సంస్థ తెల్పింది. ఐతే బిస్కెట్‌ కంపెనీ వాదనను కన్‌జ్యూమర్‌ ఫోరం తోసిపుచ్చింది.

ప్యాకెట్‌ రేపర్ లేదా లేబుల్‌పై లభించే ఉత్పత్తి సమాచారం కస్టమర్‌ సంతృప్తి పరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి సంభావ్య వినియోగదారు ఉత్పత్తి కొనుగోలును నిర్ణయించడానికి రేపర్‌ను మాత్రమే చూస్తారు. దానిపై బిస్కెట్ల సంఖ్య స్పష్టంగా పేర్కొన్నందున విధిగా దాని ఆధారంగా మాత్రమే వినియోగదారుడికి విక్రయించాలి. అలా కాకుండా బిస్కెట్‌ ప్యాకెట్‌పై ఉన్న సంఖ్య కంటే తక్కువ బిస్కెట్లు ఉంటే అది తయారీ సంస్థ సేవా లోపం అవుతుంది. ఈ చర్య వినియోగదారుడిని తప్పుదోవ పట్టించినట్లే అవుతుందని స్పష్టం చేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఢిల్లీ బాబుకి లక్ష రూపాయలు పరిహారంగా చెల్లించాలని, న్యాయ వ్యాజ్య ఖర్చుల నిమిత్తం అదనంగా మరో పది వేలు చెల్లించాలని ఫోరం ఆదేశించింది. బిస్కెట్‌ ప్యాకెట్‌ విక్రయించిన స్టోర్‌ లోపం ఏమీ లేనందున ఆ స్టోర్‌పై దాఖలైన ఫిర్యాదును కొట్టివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..