One Nation One Election: జమిలి ఎన్నికలపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం.. రామ్‌నాథ్‌కోవింద్‌ నివాసంలో భేటీ..

Jamili Elections: వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ కోసం కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసమావేశంలో కీలక అంశాలను చర్చించారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. అందుకు ఏయే రాజ్యాంగ అధికారణల సవరణలు చెయ్యాలో, ఏయే చట్టాల సవరణ చెయ్యాలో కమిటీ అధ్యయనం చేస్తుంది.

One Nation One Election: జమిలి ఎన్నికలపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం.. రామ్‌నాథ్‌కోవింద్‌ నివాసంలో భేటీ..
Ram Nath Kovind
Follow us
Venkata Chari

|

Updated on: Sep 06, 2023 | 8:54 PM

Jamili Elections: జమిలి ఎన్నికలపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ నివాసంలో ఈ భేటీ జరిగింది. వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌పై కమిటీ చర్చించింది. 8 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్‌ నుంచి ఎంపిక చేసిన అధిర్‌రంజన్‌ చౌదరి ఈ సమావేశానికి హాజరుకాలేదు.

ఏడు కీలక అంశాలపై చర్చ..

విపక్షాలు ఒకే దేశం ఒకే ఎన్నికల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జమిలీ ఎన్నికలపై జరుగుతున్న తొలి సమావేశం సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, న్యాయశాఖ కార్యదర్శి ఇతర నేతలు హాజరయ్యారు. ఈ హైలెవెల్ కమిటీ సమావేశంలో ఏడు కీలక అంశాలపై చర్చించింది.

ఇవి కూడా చదవండి

ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ.. మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహణ..

ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. అందుకు ఏయే రాజ్యాంగ అధికారణల సవరణలు చెయ్యాలో, ఏయే చట్టాల సవరణ చెయ్యాలో కమిటీ అధ్యయనం చేస్తుంది. ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కాని పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశం ఉందా లేదా అన్నదానిపై కమిటీ అధ్యయనం చేస్తుంది.

తొలి సమావేశం..

పరిస్థితులు అనుకూలించి ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత, మళ్లీ ఇది దెబ్బ తినకుండా తదనంతరం కూడా కొనసాగడానికి అవసరమైన చర్యలపై కూడా కమిటీ సిఫారసు చేస్తుంది. ఒకేసారి ఎన్నికలకు ఈవీఎంలు, వివి ప్యాట్ల అవసరం ఎంత? వాటితో పాటు మానవ వనరుల అవసరమెంతో కూడా స్పష్టమైన నివేదిక సమర్పించే అవకాశం ఉంది.

ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు..

లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు తీసుకునే అంశమై కార్యాచరణను ఈ కమిటీ సూచించే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..