ఇదేక్కడి విచిత్రం..! బ్యాంక్‌ అకౌంటే లేని కూలీ ఖాతాలో రూ.200కోట్లు..! తనను కాపాడాలంటూ బాధితుడి వేడుకోలు..

ఈ మొత్తం విషయం వెలుగులోకి రావడంతో విక్రమ్ ఓ వీడియోను విడుదల చేశాడు. తాను, తన కుటుంబం ప్రమాదంలో ఉన్నామని, పోలీసులు తన ఇంటికి వచ్చారని చెప్పాడు. తనకు చాలా చోట్ల నుంచి నిరంతరం కాల్స్ వస్తున్నాయని కూడా చెప్పాడు. తన ఖాతాలో ఉన్న 200 కోట్ల రూపాయల కోసం ఎవరైనా తన ప్రాణాలకు హాని కలిగిస్తారేమోనని విక్రమ్ భయాందోళన వ్యక్తం చేశాడు.

ఇదేక్కడి విచిత్రం..! బ్యాంక్‌ అకౌంటే లేని కూలీ ఖాతాలో రూ.200కోట్లు..! తనను కాపాడాలంటూ బాధితుడి వేడుకోలు..
Gujrat Worker
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 07, 2023 | 8:04 PM

అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం.. కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతుంటారు.. లాటరీ టికెట్‌ లాంటి జాక్‌పాట్‌ తగిలిన కొందరు పది, ఇరవై రూపాయల ఖర్చుతోనే కోట్లు సంపాదిస్తుంటారు..అలాంటి వార్తలు మనం అనేకం చూస్తుంటాం. ఇకపోతే, మరికొందరు చూస్తుండగా, ఉన్నదంతా పోగొట్టుకుని బీకరిగా మిగిలిపోతుంటారు.. అయితే, అదృష్టం అందరికీ ఒకేలా ఉండదు.. కొందరికి ఇంటి దాకా వచ్చి చేతికి అందకుండానే జారిపోతుంటుంది.. అలాంటిదే ఈ ఘటన కూడా.. ఇక్కడ ఓ కూలీ బ్యాంకు ఖాతాలో హఠాత్తుగా 200 కోట్ల రూపాయలు జమ అయిన షాకింగ్‌ సంఘటన వెలుగులోకి వచ్చింది. దాంతో హుటాహుటినా పోలీసులు అతడి ఇంటిని చుట్టుముట్టారు. ఈ విషయంపై దర్యాప్తు అనంతరం పోలీసులు అతడి బ్యాంక్‌ ఖాతాను స్తంభింపజేశారు. అతని అకౌంట్‌నుంచి ఎలాంటి లావాదేవీలను నిర్వహించకుండా బ్యాంక్‌ అధికారులతో చర్చించారు. హర్యానాలో వెలుగు చూసింది ఈ సంఘటన. గుజరాత్‌ పోలీసుల అభ్యర్థన మేరకు ఆ కూలీ ఖాతాను స్తంభింపజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

హర్యానాలోని చర్కీ-దాద్రీలో నివసించే విక్రమ్ అనే వ్యక్తి ఖాతాలో ఒకేసారి ఏకంగా రూ. 200కోట్లు జమ అయ్యాయి. విక్రమ్ ఖాతాలోకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో అతని కుటుంబీకులు కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ డబ్బు ఎవరు పంపారు, ఎక్కడి నుంచి పంపించారు అనే విషయాలపై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఏది ఏమైనా విక్రమ్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా ద్వారా పెద్ద మోసం జరుగుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో గుజరాత్ పోలీసులు సంబంధిత బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. విక్రమ్ ఖాతా యెస్ బ్యాంక్‌లో ఉంది. అయితే విక్రమ్‌కి తన పేరు మీద ఈ ఖాతాను ఎవరు తెరిచారో, ఇంత పెద్ద మొత్తంలో ఎవరు డిపాజిట్ చేశారో కూడా తనకు తెలియదని పోలీసులకు తెలిపాడు. కానీ ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో పోలీసులు తనపై చర్యలు తీసుకుంటారనే భయంతో విక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

అయితే, అతని అకౌంట్‌లో పెద్ద మొత్తంలో నగదు జమ అయిన విషయం పోలీసులకు తెలియటంతో వెంటనే పోలీసులు విక్రమ్‌ ఇంటికి చేరుకున్నారు. అతడి బ్యాంకు ఖాతా వివరాలు అడిగారు. కానీ తాను ఏ బ్యాంకులోనూ అకౌంట్‌ తెరవలేదని, తనకు ఎలాంటి బ్యాంక్‌ ఖాతా నెంబర్‌ లేదని చెప్పాడు. దాంతో పోలీసులే కంగుతిన్నారు. అయితే నా పేరు మీద ఉన్న అకౌంట్‌ని వెరిఫై చేయగా.. ఈ ఖాతాలో కోట్లాది రూపాయలు ఉన్నట్టు తెలిసింది. కానీ ఈ ఖాతా, డబ్బు గురించి తనకు తెలియదని చెప్పాడు. అయితే, ఈ మొత్తం విషయం పోలీసులకు చెప్పాలంటే భయపడినట్టుగా చెప్పారు. అనంతరం పోలీసులు విక్రమ్‌ను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ స్కాంలో విక్రమ్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల వద్ద ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకపోవడంతో గ్రామస్తులు విక్రమ్‌ను అరెస్టు చేసేందుకు అనుమతించలేదు.

ఇవి కూడా చదవండి

ఈ మొత్తం విషయం వెలుగులోకి రావడంతో విక్రమ్ ఓ వీడియోను విడుదల చేశాడు. తాను, తన కుటుంబం ప్రమాదంలో ఉన్నామని, పోలీసులు తన ఇంటికి వచ్చారని చెప్పాడు. తనకు చాలా చోట్ల నుంచి నిరంతరం కాల్స్ వస్తున్నాయని కూడా చెప్పాడు. తన ఖాతాలో ఉన్న 200 కోట్ల రూపాయల కోసం ఎవరైనా తన ప్రాణాలకు హాని కలిగిస్తారేమోనని విక్రమ్ భయాందోళన వ్యక్తం చేశాడు. తనకు గానీ, తన కుటుంబానికి గానీ డబ్బు అక్కర్లేదని చెప్పాడు. ఈ కేసును వీలైనంత త్వరగా పోలీసులు విచారించాలని విక్రమ్ కోరుతున్నాడు.. ఈ డబ్బును ప్రభుత్వమే తీసుకోవాలని కూడా విక్రమ్ అంటున్నాడు. డబ్బుకంటే మాకు మా జీవితాలు మరింత ముఖ్యమైనవి. మమ్మల్ని సురక్షితంగా ఉండనిస్తే చాలని విక్రమ్ కోరుతున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…