AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కథకాదు.. సినిమా అసలే కాదు.. ! కొడుకు పుట్టిన రోజు చేసేందుకు ఓ తండ్రి పడ్డ కష్టం..

అది బ్రిజేష్ కొడుకు పుట్టినరోజు. తన పుట్టినరోజుకు కేక్, బెలూన్లు తీసుకురావాలని తండ్రిని కోరాడు. కుమారుడి పుట్టినరోజు జరుపుకోవడానికి డబ్బులు లేకపోవడంతో బ్రిజేష్ రక్తం అమ్మి డబ్బు సంపాదించాలని ప్రయత్నించాడు. బ్రిజేష్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా ఆసుపత్రికి రక్తదానం చేసేందుకు వెళ్లాడు. అయితే..

ఇది కథకాదు.. సినిమా అసలే కాదు.. ! కొడుకు పుట్టిన రోజు చేసేందుకు ఓ తండ్రి పడ్డ కష్టం..
Sons Birthday
Jyothi Gadda
|

Updated on: Sep 07, 2023 | 9:18 PM

Share

ఎలాంటి మనిషి అయినా సరే.. పరిస్థితి మోకరిల్లాల్సిందే. తన కొడుకు పుట్టినరోజు జరుపుకోవడానికి ఓ తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే ఈ తండ్రి పరిస్థితి ముందు నిస్సహాయుడిగా నిలబడాల్సి వచ్చింది. విధి వక్రీకరించటంతో ఓ తండ్రి తన కొడుకు పుట్టిన రోజున జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కొడుకు పుట్టిన రోజు జరుపుకోవడానికి డబ్బులు లేకపోవడంతో ఆ తండ్రి తన రక్తాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నించాడు. అయితే అందులోనూ అతడు విఫలమయ్యాడు. చివరకు తెగించి మరో ప్రయత్నం చేశాడు.. అది కూడా ఫలించకపోగా, చావు తప్పి ఒళ్లు హూనం చేసుకోవాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లో తండ్రి చేస్తున్న పోరాటం చూస్తే కన్నీళ్లు వస్తాయి. ఈ తండ్రి కష్టం చూసిన ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

గోపాల్‌పూర్‌కు చెందిన బ్రిజేష్ ధాకడ్ తన కొడుకు పుట్టినరోజు జరుపుకోవడానికి డబ్బు కోసం ప్రయత్నించాడు. కానీ, ఈ తండ్రి పరిస్థితి ముందు హతాశుడయ్యాడు. అది బ్రిజేష్ కొడుకు పుట్టినరోజు. తన పుట్టినరోజుకు కేక్, బెలూన్లు తీసుకురావాలని తండ్రిని కోరాడు. కుమారుడి పుట్టినరోజు జరుపుకోవడానికి డబ్బులు లేకపోవడంతో బ్రిజేష్ రక్తం అమ్మి డబ్బు సంపాదించాలని ప్రయత్నించాడు. బ్రిజేష్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా ఆసుపత్రికి రక్తదానం చేసేందుకు వెళ్లాడు. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో రక్తం అవసరం లేదన్నారు ఆస్పత్రి సిబ్బంది. దీంతో ఇప్పుడు ఏం చేయాలో బ్రిజేష్‌కు అర్థం కాలేదు. డబ్బుల కోసం ఎక్కడికి వెళ్లాలి.. ఎక్కడ్నుంచి తేవాలి అని ఆలోచించాడు. ఇంతలో అతనికి దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చింది.

అదే ఆసుపత్రిలో జింగూర కాలనీకి చెందిన రాజేష్ శ్రీవాస్తవ అనే రోగి చేరాడు. వార్డులో అతని మొబైల్‌కి ఛార్జింగ్‌ పెట్టి కనిపించింది. బ్రిజేష్ ఈ రోగి మొబైల్ ఫోన్ దొంగిలించడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో రాజేష్ శ్రీవాస్తవ బంధువు బ్రిజేష్ మొబైల్ ఫోన్ దొంగిలించడం చూశాడు. మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్న బ్రిజేష్ ను బంధువులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంతలోనే అక్కడే ఉన్న ఇతర రోగులు, అటెండర్లు సైతం బ్రిజేష్‌ను పట్టుకుని దారుణంగా కొట్టారు. ఈ సమయంలో ఆసుపత్రిలో ఉన్న మరికొందరు కూడా బ్రిజేష్‌ను దొంగ అంటూ దాడి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

రాజేష్ శ్రీవాస్తవ బంధువులు బ్రిజేష్‌ను కొట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్రిజేష్‌ను విచారించారు. ఆ రోజు తన కొడుకు పుట్టినరోజు అని, చేతిలో డబ్బులు లేని కారణంగా తాను..రక్తం అమ్ముకోవటానికి వచ్చానని చెప్పాడు. తన ప్రయత్నం విఫలమవడంతో బ్రిజేష్ దొంగతనానికి ప్రయత్నించినట్లు పోలీసులకు తెలిపాడు. ఇది విన్న రాజేష్ శ్రీవాస్తవ బంధువులు కూడా విచారం వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..