Bharath - India: దేశం పేరు మారితే వారికి మాత్రం భారీ కష్టాలే..! వీడియో..

Bharath – India: దేశం పేరు మారితే వారికి మాత్రం భారీ కష్టాలే..! వీడియో..

Anil kumar poka

|

Updated on: Sep 07, 2023 | 9:35 PM

ఇండియా పేరు భారత్‌గా మారితే దేశంలోని వేలాది వెబ్‌సైట్లకు కష్టాలు మొదలుకానున్నాయి. ఎందుకంటే చాలా వెబ్‌సైట్లు తమ పేర్లలో డాట్ ఇన్‌ అనే డొమైన్‌ను వాడుతున్నాయి. ఇన్నాళ్లూ ఇండియా పేరు ఉంది కాబట్టే ఇండియా స్పెల్లింగ్‌లోని తొలి రెండు అక్షరాలు అయిన ఐఎన్‌లను ఆయా వెబ్‌సైట్ల పేరు చివరన పెట్టుకున్నాయి. .ఇన్‌ డొమైన్‌ను కంట్రీ కోడ్‌ టాప్‌ లేయర్‌ డొమైన్‌ TLD అంటారు.

ఇండియా పేరు భారత్‌గా మారితే దేశంలోని వేలాది వెబ్‌సైట్లకు కష్టాలు మొదలుకానున్నాయి. ఎందుకంటే చాలా వెబ్‌సైట్లు తమ పేర్లలో డాట్ ఇన్‌ అనే డొమైన్‌ను వాడుతున్నాయి. ఇన్నాళ్లూ ఇండియా పేరు ఉంది కాబట్టే ఇండియా స్పెల్లింగ్‌లోని తొలి రెండు అక్షరాలు అయిన ఐఎన్‌లను ఆయా వెబ్‌సైట్ల పేరు చివరన పెట్టుకున్నాయి. .ఇన్‌ డొమైన్‌ను కంట్రీ కోడ్‌ టాప్‌ లేయర్‌ డొమైన్‌ TLD అంటారు. దేశం పేరు ఇండియా నుంచి భారత్‌కు మారితే .ఇన్‌ అనే డొమైన్‌ భారత్‌ అనే కొత్త పేరును ప్రతిబింబించదు. అప్పుడు భారత్‌ అనగానే ఠక్కున స్ఫురించేలా కొత్త టీఎల్‌డీకి మారితే బాగుంటుంది.

భారత్‌ ఇంగ్లిష్‌ స్పెల్లింగ్‌లోని బీహెచ్‌ లేదా బీఆర్‌ ఇంగ్లిష్‌ అక్షరాలతో కొత్త డొమైన్‌ను వాడాలి. అంటే బీహెచ్‌ లేదా .బీఆర్‌ అని ఉంటే సబబుగా ఉంటుంది. కానీ ఈ రెండు డొమైన్‌లను ఇప్పటికే వేరే దేశాలకు కేటాయించారు. దీంతో వెబ్‌సైట్‌ పేరు చూడగానే ఇది భారత్‌దే అని గుర్తుపట్టేలా ఉండే కొత్త డొమైన్‌ మనకిప్పుడు అందుబాటులో లేదు. అదే ఇప్పుడు అసలు సమస్య. ఎన్‌ఐఎక్స్ఎక్స్ వారు ఇన్‌రిజిస్ట్రీ సంస్థ ద్వారా .ఇన్‌ డొమైన్‌ను రిజిస్టర్‌ చేశారు. ప్రత్యేకమైన అవసరాల కోసం ఇందులోనే సబ్‌డొమైన్‌లను సృష్టించి కొన్ని సంస్థలకు కేటాయించారు. జీఓవీ.ఇన్‌ అనే డొమైన్‌ను భారత ప్రభుత్వ రంగ సంస్థలు వాడుకుంటున్నాయి. ఎంఐఎల్‌.ఇన్‌ అనే డొమైన్‌ను దేశ సైన్యం వినియోగిస్తోంది. ఇప్పుడు ఒక్కసారిగా డొమైన్‌ మారిపోతే కొత్త డొమైన్‌తో ఆయా వెబ్‌సైట్లకు మళ్లీ అంతటి గుర్తింపు రావడం చాలా కష్టమంటున్నారు సైబర్ ఎక్స్‌ఫర్ట్స్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..