AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Bharat: దేశం పేరు భారత్ వెనుక అసలు మతలబు ఇదే..! పూర్తి వివరాలు..

India vs Bharat: దేశం పేరు భారత్ వెనుక అసలు మతలబు ఇదే..! పూర్తి వివరాలు..

Anil kumar poka
|

Updated on: Sep 07, 2023 | 9:29 PM

Share

అమృతోత్సవ వేళ దేశం పేరు ఇండియా మారి భారత్‌గా పిలవబోతున్నారనే సంకేతాల నేపథ్యంలో ఈ పేర్ల వెనకున్న చరిత్ర ఏంటో తెలుసా! ఇండియా పేరు ఎలా వచ్చింది? అంతకుముందు ఏం పేర్లున్నాయనేది ఆసక్తికరంగా మారింది. భరత వర్ష, భారత అనేది పురాణాల కాలం నుంచి వినిపిస్తున్న పేర్లు. ఆర్యావర్త, జంబూద్వీపం, నభివర్ష అనే పేర్లు కూడా వైదిక సంస్కృతిలో కనిపిస్తాయి. క్రీస్తు పూర్వం మూడువేల సంవత్సరాలనాటి...

అమృతోత్సవ వేళ దేశం పేరు ఇండియా మారి భారత్‌గా పిలవబోతున్నారనే సంకేతాల నేపథ్యంలో ఈ పేర్ల వెనకున్న చరిత్ర ఏంటో తెలుసా! ఇండియా పేరు ఎలా వచ్చింది? అంతకుముందు ఏం పేర్లున్నాయనేది ఆసక్తికరంగా మారింది. భరత వర్ష, భారత అనేది పురాణాల కాలం నుంచి వినిపిస్తున్న పేర్లు. ఆర్యావర్త, జంబూద్వీపం, నభివర్ష అనే పేర్లు కూడా వైదిక సంస్కృతిలో కనిపిస్తాయి. క్రీస్తు పూర్వం మూడువేల సంవత్సరాలనాటి మెసపటోమియా నాగరికత కాలంలో లభించిన ఆధారాల ప్రకారం సింధు నాగరికత విలసిల్లిన ప్రస్తుత భారత ఉపఖండాన్ని మెలూహా పేరుతో పిలిచే వారని చరిత్రకారులు చెబుతున్నారు. రాజకీయ చరిత్రలో మెలూహాకు పెద్ద ప్రాధాన్యం లభించలేదు. భరతవర్ష, భారత్‌ మాత్రం తరతరాలుగా కొనసాగుతూ వచ్చాయి. పర్షియన్ల రాకతో హిందూ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రీస్తుపూర్వం ఏడో శతాబ్దిలో సింధు లోయను స్వాధీనం చేసుకున్న పర్షియన్లు – సంస్కృతంలోని సింధును హిందుగా పలికారు. క్రీస్తుశకం ఆరంభంలో దీనికి పర్షియన్‌ పదం ‘స్థాన్‌’ జోడించి హిందుస్థాన్‌గా మార్చేశారు. పర్షియన్ల హింద్‌ కాస్తా గ్రీకుల నోళ్లలో ఇండస్‌గా మారింది. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దిలో అలెగ్జాండర్‌ భారత్‌పై దండెత్తి ఇండస్‌ తర్వాతి ప్రాంతాన్ని ఇండియాగా పలికాడు. తర్వాత వచ్చిన మొఘల్‌ చక్రవర్తులు భారత్‌ పేరును హిందుస్థాన్‌గానే ప్రాచుర్యంలో ఉంచారు. ఆసియాలోని అనేక దేశాల్లో ఈ ప్రాంతాన్ని హిందుస్థాన్‌ పేరుతోనే పిలిచేవారు. 18వ శతాబ్దం చివరి దాకా ఇదే పేరుండేది.

భారత ఉపఖండం బ్రిటిష్‌ వారి చేతుల్లోకి వెళ్లిన తర్వాత హిందుస్థాన్‌ పేరు మాయమై ఇండియా పేరు స్థిరపడింది. స్థానిక పేర్లు, సంప్రదాయాలు, చదువులను తమవాటితో నింపేయాలని చూసిన ఆంగ్లేయులు ఇండియా పేరును పటాల్లో, అధికారిక పేర్లలో ఖాయం చేశారు. సర్వే ఆఫ్‌ ఇండియా లాంటి సంస్థలనూ ఇండియా పేరుతో స్థాపించారు. బ్రిటిష్‌ వలస పాలన పోయి, స్వాతంత్య్రం వచ్చాక దేశం పేరుపై వాదోపవాదాలు మొదలయ్యాయి. రాజ్యాంగ రచన సమయంలోనూ దీనిపై తీవ్ర చర్చోపచర్చ జరిగింది. ఇండియా అనే ఉంచాలని కొంతమంది డిమాండ్‌ చేయగా, విదేశీయులు పెట్టిన పేరు బదులు మనకున్న పురాతన భారత్‌ అని పిలుచుకుందామని మరికొందరు వాదించారు. హిందుస్థాన్‌ అని పెడదామని సూచించిన వారూ ఉన్నారు. చివరకు ఎవరినీ నొప్పించక తానొవ్వక ఇండియా, భారత్‌ పేర్లను ఉంచేశారు. అడపాదడపా దేశం పేరును భారత్‌గా మార్చాలంటూ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. 2012లో కాంగ్రెస్‌ సభ్యుడు శాంతారాం నాయక్‌ పార్లమెంటులో దేశం పేరును భారత్‌ అని మార్చాలంటూ ఓ బిల్లు ప్రవేశపెట్టారు. మనం భారత్‌ మాతాకీ జై అంటామే తప్ప, ఇండియాకీ జై అనం కదా అంటూ వాదించారు. 2014లో యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఎంపీగా ఇలాంటి డిమాండ్‌తోనే ఓ బిల్లు ప్రవేశపెట్టారు. దేశం పేరు భారత్‌గా మార్చాలని సుప్రీంకోర్టులో అనేకమంది పిటిషన్లు వేశారు. ఈ విషయంలో తాము చేసేదేమీ లేదని, కేంద్రం వద్ద దరఖాస్తు చేసుకోవాలని కోర్టు ఇటీవలే స్పష్టంచేసింది. తాజాగా జీ20 శిఖరాగ్ర సమావేశాల ఆహ్వాన పత్రికలో భారత్ ప్రస్తావన తీసుకువచ్చింది కేంద్రం. దీంతో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరతీసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..