Krishnashtami: అడవి బిడ్డల కృష్ణాష్టమి వేడుకలు.. వర్షంలోనూ ఉట్టి కొట్టిన చిలిపి కృష్ణుడు..! ఆ సందడి మామూలుగా లేదు మరి..

Visakhapatnam: గోకుల కృష్ణయ్య జన్మాష్టమి వేడుకలు కనుల పండువగా సాగాయి. చిన్నారులు, విద్యార్థులు గోపికలు శ్రీకృష్ణుడి వేషధారణలో ముస్తాబయి సందడి చేశారు. చింతపల్లి రామాలయం వీధిలో నిర్వహించిన జన్మాష్టమి వేడుకలు ఘనంగా అంబారన్నంటాయి.. సకల దేవతల ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానికులు.. వర్షం లోనూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Krishnashtami: అడవి బిడ్డల కృష్ణాష్టమి వేడుకలు.. వర్షంలోనూ ఉట్టి కొట్టిన చిలిపి కృష్ణుడు..! ఆ సందడి మామూలుగా లేదు మరి..
Krishnashtami Celebrations
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 07, 2023 | 8:24 PM

విశాఖపట్నం, సెప్టెంబర్ 07:  వాళ్లంతా గిరిజన బాల బాలికలు.. నల్లనయ్య జన్మదిన వేడుకల కోసం ముస్తాబయ్యారు. కొంతమంది చిలిపి కృష్ణుడు వేషంలో.. మరి కొంతమంది గోపికల వస్త్రధారణలో..! ఇంకొంతమంది దేవతల రూపాల్లో అలంకరించుకున్నారు. ఇక చెప్పేదేముంది.. చిలిపి చిలిపి చేష్టలు.. నృత్యాలు.. ఆటపాటలతో సందడే సందడి. ఒకవైపు వర్షం కురుస్తున్నా.. కృష్ణుడి జన్మాష్టమి వేడుకల్లో సరదాగా సంబరాలు చేసుకున్నారు. ఇక ఆ గిరిజన మహిళలు సైతం.. ఎంచక్కా పిల్లలతో కలిసి ఆడిపడారు. ఎక్కడో తెలుసా..?!

– శ్రావణమాసం వస్తే.. పండుగల సీజన్ ఆరంభమైనట్టే. ఈ నెలలోనే శ్రీకృష్ణుడి జన్మాష్టమి వేడుకలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు జన్మించిన శుభదినమే జన్మాష్టమి. కృష్ణాష్టమి గోకులాష్టమి కృష్ణ జయంతి కూడా ఈ రోజుకు అంటారు. ఆ రోజున దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా మహిళలు పిల్లలు సంబరాల్లో మునిగితేలుతూ ఉంటారు.

శ్రీకృష్ణుడు గోపికల్లా మారిన చిన్నారి అడవి బిడ్డలు..

ఇవి కూడా చదవండి

– అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో గోకుల కృష్ణయ్య జన్మాష్టమి వేడుకలు కనుల పండువగా సాగాయి. చిన్నారులు, విద్యార్థులు గోపికలు శ్రీకృష్ణుడి వేషధారణలో ముస్తాబయి సందడి చేశారు. చింతపల్లి రామాలయం వీధిలో నిర్వహించిన జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సకల దేవతల ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానికులు.. వర్షం లోనూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

తాజంగిలోనూ..

– చింతపల్లి ఏజెన్సీ తాజంగిలోనూ దేవతల వేషధారణలో చిన్నారులు విద్యార్థులు ముస్తాబై అబ్బురపరిచారు. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ.. ఉట్టి కొట్టే వేడుకలో అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. గోపికలంతా ఆడి పాడారు. గిరిజన మహిళలు కోలాటాలు, నృత్యాలతో సందడి చేశారు.

– శ్రీకృష్ణుని వేడుకలో తామేమీ తక్కువ కాదని నిరూపించారు అడవి బిడ్డలు. మేము సైతం అంటూ సంబరాల్లో పాల్గొన్నారు. సందడి చేస్తూ గడిపారు. నల్లనయ్య జన్మదిన వేడుకలు అంటే మరి మామూలుగా ఉండదు కదా.. మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..