అర్ధరాత్రి బిజినెస్‌ మ్యాన్‌ ఇంట్లో దూరిన దొంగలు.. దొరికినకాడికి ఊడ్చేశారు.. కానీ, పాపం.. చెప్పుల కోసం వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోహియా నగర్‌ ప్రాంతంలో కొందరు దొంగలు దొంగతనం చేసేందుకు ఓ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి గోడ దూకి ఇంట్లోకి చొరబడిన దొంగలు దొంగతనం చేసి వెళ్లిపోయారు. అప్పుడే ఓ దొంగ తన చెప్పులు ఆ ఇంట్లోనే వదిలేసినట్టుగా గుర్తుకు వచ్చింది.. దాంతో అతను..

అర్ధరాత్రి బిజినెస్‌ మ్యాన్‌ ఇంట్లో దూరిన దొంగలు.. దొరికినకాడికి ఊడ్చేశారు.. కానీ, పాపం.. చెప్పుల కోసం వెళితే..
Thief
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 07, 2023 | 6:08 PM

అర్ధరాత్రి గోడ దూకి ఓ ఇంట్లోకి దూరిన దొంగలు దొరికినకాడికి దోచుకెళ్లారు. చోరీ చేసిన సొత్తును ఎత్తుకెళ్లారు.. కానీ, దొంగతనానికి వచ్చిన వారిలో ఒక దుండగుడు.. తన చెప్పులు అక్కడే మర్చిపోయాడు. సగం దూరం వెళ్లాక చెప్పులు మర్చిపోయాననే విషయం గుర్తుకు వచ్చింది. దాంతో అతడు వేగంగా వెనక్కి పరిగెత్తి చెప్పులు తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. అంతలోనే గమనించిన స్థానికులు దొంగను పట్టుకుని దేహాశుద్ధి చేశారు. ఈ ఘటన యూపీలోని మీరట్‌లో వెలుగు చూసింది. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఒక దొంగ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దొంగతనానికి వచ్చిన దొంగోడు.. తన చెప్పులు మర్చిపోయి రావటంతో దొరికిపోయాడని చెప్పారు. అయితే, అతని సహచరులు పారిపోయారు. ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. మీరట్‌లోని లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోహియా నగర్‌ ప్రాంతంలో కొందరు దొంగలు దొంగతనం చేసేందుకు ఓ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి గోడ దూకి ఇంట్లోకి చొరబడిన దొంగలు దొంగతనం చేసి వెళ్లిపోయారు. అప్పుడే ఓ దొంగ తన చెప్పులు ఆ ఇంట్లోనే వదిలేసినట్టుగా గుర్తుకు వచ్చింది..దాంతో అతను వేగంగా వెనక్కి పరిగెత్తి చెప్పులు వేసుకుని తిరిగి పారిపోయే ప్రయత్నం చేశాడు.. కానీ, అంతలోనే స్థానికులు అతన్ని గమనించి పట్టుకున్నారు. దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మిగిలిన వారంతా పారిపోయారు.

తాజ్‌గార్డెన్‌ ఫతేహుల్లాపూర్‌కు చెందిన మహఫుజ్‌ మంగళవారం తన అత్తమామల ఇంటికి వెళ్లాడు. తాళం వేసి ఉన్న ఆయన ఇంట్లోకి బుధవారం ముగ్గురు దొంగలు ప్రవేశించి ఇంట్లోని వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇంతలో చప్పుడు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకుని అప్రమత్తం చేశారు. పట్టుబడిన దొంగను పట్టుకుని చితక్కొట్టారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

పోలీసుల విచారణలో పట్టుబడిన దొంగ తన పేరు ఇమ్రాన్ అని చెప్పాడు. తనతో పాటు తన సహచరుల పేర్లను కూడా చెప్పాడు. ఇమ్రాన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పారిపోయిన దొంగలను కూడా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఆ ఇంట్లో నుంచి దొంగిలించిన వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అందరినీ అరెస్ట్ చేసిన రిమాండ్ కు తరలించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. వార్త సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది. ఇది తెలిసిన నెటిజన్లు సైతం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..