AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తిరుమలకొండపై ఆపరేషన్ చిరుతపై టీటీడీ క్లారిటీ.. లక్షితపై దాడి చేసిన చిరుతను జూలోనే..!

ఐదు చిరుతలు చిక్కాయి.. మరి ఎలుగుబంట్ల సంగతేంటి? ట్రాప్ కెమెరాలకు చిరుతలు మాత్రమే చిక్కుతున్నాయి. ఎలుగుబంట్లు ఎందుకు చిక్కడం లేదు? అధికారులు మాత్రం ట్రాప్ కెమెరాల మానిటరింగ్‌ 24గంటల పాటు ఉంటుందని.. వన్యప్రాణాలు సంచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామంటున్నారు. ఆపరేషన్ చిరుతను కూడా కంటిన్యూ చేస్తామంటున్నారు.

Andhra Pradesh: తిరుమలకొండపై ఆపరేషన్ చిరుతపై టీటీడీ క్లారిటీ.. లక్షితపై దాడి చేసిన చిరుతను జూలోనే..!
Fifth Leopard Captured
Jyothi Gadda
|

Updated on: Sep 07, 2023 | 4:16 PM

Share

తిరుమల కొండపై ఐదు చిరుతలు చిక్కాయి.. మరి వాటిలో చిన్నారి లక్షితపై దాడి చేసింది ఏ చిరుత? లక్షితపై దాడి తర్వాత నాలుగు చిరుతల్ని అధికారులు బంధించారు. వాటి గోళ్లు, వెంట్రుకల్ని ల్యాబ్‌కి పంపారు. వాటికి సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది. అవి వస్తే.. లక్షితపై దాడి చేసిన చిరుత ఏదన్న దానిపై స్పష్టత రానుంది. ఒకవేళ నాలుగు చిరుతల్లో దాడి చేసిన చిరుత ఉంటే.. జూలోనే బంధించే అవకాశముంది.

జూన్‌ 24 నుంచి ఇప్పటిదాకా మొత్తం ఐదు చిరుతల్ని బంధించారు ఫారెస్ట్ అధికారులు. అధికారులు మొదటినుంచి ఐదు చిరుతలు సంచరిస్తున్నాయని అనుమానిస్తున్నారు. వాళ్లు అనుమానించినట్టే ఐదు చిరుతలు చిక్కాయి. అలాగని ఇంతటితో చిరుతల సంచారం లేదని భావించలేమంటున్నారు అధికారులు.

ఆపరేషన్ చిరుతలో భాగంగా నడకమార్గంలో దాదాపు 300ట్రాప్ కెమెరాలు, అధునాతన బోన్లు ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలను నిరంతరం మానిటరింగ్ చేస్తూ వన్య మృగాల సంచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. చిరుతల సంచారాన్ని గుర్తిస్తూ అవి తిరిగే ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. అయితే నడకమార్గాల్లో వన్య ప్రాణుల సంచారాన్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూనే ఉంటామంటున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

ఐదో చిరుతను బంధించిన బోను దగ్గర ఆనవాళ్లు సేకరించారు ఐసర్ సైంటిస్ట్‌ డాక్టర్ నందిని. చిన్నారులు కౌశిక్, లక్షితలపై దాడి చేసింది ఏ చిరుత అన్నది గుర్తించేందుకు నమూనాలు తీసుకున్నారు. శాంపిల్స్ రిపోర్ట్స్‌కి ఐదు రోజుల సమయం పట్టే ఛాన్స్ ఉంది. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరస్పాండెంట్‌ రాజు అందిస్తారు.

ఆపరేషన్ చిరుత నిరంతరం కొనసాగుతుందన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌. మొత్తం 300 మంది సిబ్బంది పాల్గొంటున్నారని.. ఆధునాతన బోన్లతో చిరుతల్ని బంధించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

ఐదు చిరుతలు చిక్కడంతో.. నడకమార్గంలో భక్తులకు ఎలాంటి భయాలు అక్కర్లేదంటున్నారు అధికారులు. భక్తులు ధైర్యంగా కొండపైకి నడుచుకుంటూ వెళ్లొచ్చంటున్నారు. మరోవైపు వన్య మృగాల సంచారం.. ఆందోళన అవసరం లేకుండా శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషిస్తోంది టీటీడీ. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరస్పాండెంట్‌ రాజు అందిస్తారు.

ఐదు చిరుతలు చిక్కాయి.. మరి ఎలుగుబంట్ల సంగతేంటి? ట్రాప్ కెమెరాలకు చిరుతలు మాత్రమే చిక్కుతున్నాయి. ఎలుగుబంట్లు ఎందుకు చిక్కడం లేదు? అధికారులు మాత్రం ట్రాప్ కెమెరాల మానిటరింగ్‌ 24గంటల పాటు ఉంటుందని.. వన్యప్రాణాలు సంచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామంటున్నారు. ఆపరేషన్ చిరుతను కూడా కంటిన్యూ చేస్తామంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..