ఉంటున్న ఫ్లాట్‌లోనే దారుణ హత్యకు గురైన ఎయిర్ హోస్టెస్, స్వీపర్ అరెస్ట్
అపార్ట్‌మెంట్‌లోని తన కంపార్ట్‌మెంట్‌లోనే ఎయిర్ హోస్టెస్ రూపల్ గొంతు కోసిన గుర్తు తెలియని దుండగులు పరారైనట్టుగా పోలీసులు వెల్లడించారు. కానీ, కొన ఊపిరితో రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయిందని పోలీసులు తెలిపారు. అపార్ట్‌మెంట్‌లోని క్లీనింగ్ వర్కర్ అయిన విక్రమ్ అత్వాల్ (40)ని రూపల్ హత్య కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వాణిజ్య నగరం ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముంబైనగరంలోని ఓ అపార్ట్ మెంట్ లోని ఓ గదిలో 25ఏళ్ల యువతి అతి దారుణంగా హత్య చేయబడింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఎయిర్ హోస్టెస్ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెనుగొంతు కోసి దారుణంగా హత్య చేశారు. రూపాల్ ఓగ్రే (25) అనే ట్రైనీ ఎయిర్ హోస్టెస్ సెప్టెంబర్ 4సోమవారం సాయంత్రం ముంబైలోని సబర్బన్ అంధేరీలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూపల్ ఓగ్రే ఎయిర్ ఇండియాలో ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ ఏప్రిల్‌లో ముంబైకి వెళ్లారు. 25 ఏళ్ల రూపల్ ఓగ్రే తన అక్కా కలిసి ఒకే గదిలో నివసిస్తుంది. అయితే ఘటన జరిగిన సమయంలో ఆమె అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగానే ఉందని తెలిసింది. మూడు రోజుల క్రితం, ఆమె సోదరి వారి స్వగ్రామానికి వెళ్లిపోయారని సమాచారం. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అంధేరిలోని టాటా శక్తి కేంద్రంలోని మరోల్‌లోని ఎన్‌జి కాంప్లెక్స్‌లో రూపల్‌ను సోమవారం రాత్రి దారుణంగా హత్య చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. అపార్ట్‌మెంట్‌లోని తన కంపార్ట్‌మెంట్‌లోనే ఎయిర్ హోస్టెస్ రూపల్ గొంతు కోసిన గుర్తు తెలియని దుండగులు పరారైనట్టుగా పోలీసులు వెల్లడించారు. కానీ, కొన ఊపిరితో రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయిందని పోలీసులు తెలిపారు.
అపార్ట్‌మెంట్‌లోని క్లీనింగ్ వర్కర్ అయిన విక్రమ్ అత్వాల్ (40)ని రూపల్ హత్య కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే హత్యకు గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. గత 6 నెలల క్రితం రూపల్ ముంబైకి వచ్చి తన సోదరితో కలిసి మారోల్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారని. ఆమె ఇటీవలే ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్‌గా చేరిందని చెప్పారు.
కాగా, హత్య కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే 8 బృందాలను ఏర్పాటు చేశారు. విజిటర్స్ రిజిస్టర్‌లోని అన్ని ఎంట్రీలను యాక్సెస్ చేసిన తర్వాత రూపల్ చనిపోయిన సమయం ఆధారంగా మొదట 35 మంది అనుమానితుల లిస్ట్ తయారు చేసినట్టుగా చెప్పారు.. అనుమానితులను రాత్రంతా విచారించారు. స్థానిక సీసీ ఫుటేజీలను కూడా సేకరించారు. 40 ఏళ్ల విక్రమ్ అత్వాల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా డిప్యూటీ పోలీసు కమిషనర్ చెప్పారు. నిందితుడి భార్య కూడా భవనంలోని హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తోంది. కాంప్లెక్స్‌లో హౌస్ కీపర్‌గా పనిచేసిన విక్రమ్ అత్వాల్ భార్యను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు అని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..