Watch Viral Video: ఈవిడ గొప్ప చెల్లెల్లు..! అన్నకు రాఖీ కట్టి ఏం తినిపించిందో చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!

రక్షా బంధన్ నాడు తమ సోదరులకు అక్కాచెల్లెలు రాఖీ కట్టి స్వీట్లు తినిపిస్తారు. హారతి పట్టి ఆశ్వీరాదం ఇస్తారు. ప్రతిగా సోదరుడు తన తోబుట్టువుకు బహుమతి కూడా ఇస్తారు. అయితే ఈ వీడియోలో కథ కాస్త భిన్నంగా ఉంది. ఇక్కడ స్వీట్ల స్థానంలో గుట్కా వచ్చింది. అవును, ఇది చూసిన చాలా మంది షాక్ అయ్యారు. మీరు కంగుతినే ఉంటారు..

Watch Viral Video: ఈవిడ గొప్ప చెల్లెల్లు..! అన్నకు రాఖీ కట్టి ఏం తినిపించిందో చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!
Rakhi
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 06, 2023 | 2:04 PM

రక్షాబంధన్ పండగ అయిపోయింది..అయితే ఈ పండుగకు సంబంధించిన ఓ వీడియో మాత్రం ఇంటర్నెట్‌లో చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే ఈ వైరల్ రీల్‌లో ‘అన్న-చెల్లెలు’ చేసిన ఘనకార్యం అలాంటి మరీ. ఇలాంటి సంఘటన జరిగింది ఎక్కడో స్పష్టంగా తెలియదు గానీ, ఇన్‌స్టాగ్రామ్ వీధుల్లో మాత్రం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను ఆగస్టు 31న @bhaiyraam అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు పోస్ట్ చేసారు. దీనికి ఇప్పటి వరకు 44 లక్షలకు పైగా వీక్షణలు, 2 లక్షల 56 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అవును, వీడియోలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సోదరుడికి రాఖీ కట్టిన ఆ సోదరీ అతడి నోట్లో స్వీట్‌ కాకుండా ఏం తినిపించిందో చూస్తే మీరు కూడా షాక్‌ అవుతారు.

రక్షా బంధన్ నాడు తమ సోదరులకు అక్కాచెల్లెలు రాఖీ కట్టి స్వీట్లు తినిపిస్తారు. హారతి పట్టి ఆశ్వీరాదం ఇస్తారు. ప్రతిగా సోదరుడు తన తోబుట్టువుకు బహుమతి కూడా ఇస్తారు. అయితే ఈ వీడియోలో కథ కాస్త భిన్నంగా ఉంది. ఇక్కడ స్వీట్ల స్థానంలో గుట్కా వచ్చింది. అవును, ఇది చూసిన చాలా మంది షాక్ అయ్యారు. మీరు కంగుతినే ఉంటారు.. కానీ, కొన్ని సెకన్ల ఈ వైరల్ క్లిప్‌లో ఓ చెల్లెలు తన అన్నయ్యకు రాఖీ కడుతుంది..అందుకోసం కావాల్సిన అన్ని వస్తువులు తీసుకుంది. ప్లేట్‌లో కుంకుమ, రాఖీలతో పాటు గుట్కా ప్యాకెట్‌ కూడా తీసుకుంది. ముందుగా ఆ అమ్మాయి నవ్వుతూ తన అన్నయ్యకి గుట్కా తినిపించి ఆ తర్వాత రాఖీ కట్టింది. ఆ తర్వాత మిగిలిపోయిన గుట్కా ప్యాకెట్‌ కూడా తనకే ఇచ్చేసింది. పైగా ఇద్దరూ సంతోషంగా నవ్వుకుంటున్నారు. ఆ తర్వాత అమ్మాయి లేచి నిలబడింది..అన్నయ్య తన చెల్లెలి పాదాలను తాకి మొక్కుతున్నాడు.

ఇవి కూడా చదవండి

గుట్కా.. ఆరోగ్యానికి హానికరం అన్నది అందరికీ తెలిసిందే. అయినా కూడా ఈ చెల్లెలు తన అన్నయ్యకు రాఖీ కట్టి గుట్కా తినిపించింది.. ఇది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. కొందరు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. గుట్కా తినే ప్రతి ఒక్కరికీ ఇలాంటి చెల్లెలు రావాలని కొందరు అంటున్నారు. అయితే గుట్కా తినడం ఆరోగ్యానికి హానికరం.. అది తెలుసుకోండి అంటున్నారు మరికొందరు. అందుకే స్వీట్లకు గుట్కా ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదు!అని మరి కొందరు చెబుతున్నారు.

మీరు అతని భద్రత కోసం ఒక వైపు రాఖీ కడుతున్నారు.. మరోవైపు మీరు అతనికి మరణ మందు తినిపిస్తున్నారు. అయితే ఇది జోక్ అని కొందరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..