Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Nataraja Statue: G20 వేదికను అలంకరించిన 27 అడుగుల నటరాజ విగ్రహం విశిష్టత ఏంటో తెలుసా..?

ఈ ఏడాది జీ-20 సమావేశాలకు భారత్ అతిథ్యం ఇస్తోంది. జి20 కోసం.. దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఢిల్లీలోని కీలక భవనాలు, రోడ్లు విద్యుత్ కాంతులతో దగదగలాడుతున్నాయి. వెయ్యి కాంతులతో మెరిసిపోతున్నాయి. సమావేశాల సందర్భంగా ఢిల్లీ వ్యాప్తంగా కేంద్రం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.

G20 Nataraja Statue: G20 వేదికను అలంకరించిన 27 అడుగుల నటరాజ విగ్రహం విశిష్టత ఏంటో తెలుసా..?
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Sep 06, 2023 | 8:21 PM

G20 Nataraja Statue: దేశ రాజధాని ఢిల్లీలో G20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిధ్యమిస్తున్న ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపంలో ప్రత్యేక ఆకర్షణగా నటరాజస్వామి విగ్రహం నిలవనుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ నటరాజ విగ్రహాన్ని అష్టధాతువులతో తయారు చేశారు. భారత మండపం ప్రధాన ద్వారం దగ్గర దీన్ని ఇప్పటికే అమర్చారు. 27 అడుగుల ఎత్తులో ఉన్న ఈ నటరాజ విగ్రహం దాదాపు 20 టన్నుల బరువు కలిగి ఉంది. ఈ విగ్రహం ఎనిమిది లోహాలతో తయారు చేయబడిందిఇందులో 87 శాతం రాగి, 10 శాతం జింక్‌, 3 శాతం సీసం, తగరం, రజతం, స్వర్ణం, పాదరసం, ఇనుము ఉన్నాయి. ఏడు నెలల రికార్డు సమయంలో ఈ భారీ విగ్రహాన్ని తయారు చేశారు.

ఇకపోతే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ‘అష్టధాతు’ విగ్రహం చోళుల కాలం నాటి సంప్రదాయ శిల్పకళా సాంకేతికత ,సంప్రదాయ మైనపు పోత విధానంలో శిల్పశాస్త్ర కొలతలకు అనుగుణంగా ఈ విగ్రహాన్ని తమిళనాడులోని స్వామిమలైకి చెందిన స్థపతి రాధాకృష్ణన్‌ తయారు చేశారు. రాధాకృష్ణన్‌ 34 తరాలుగా ఈ విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ విగ్రహాన్ని ప్రశంసిస్తూ ప్రధాని మోదీ తమిళ్‌, ఇంగ్లిష్‌లో రెండు ట్వీట్స్‌ చేశారు. బారత మండపంలో ఏర్పాటు చేసిన నటరాజ విగ్రహం మన సమున్నత సంస్కృతి, చరిత్రను గుర్తుకు తెస్తుంది అన్నారు. G20 శిఖరాగ్ర సదస్సుకు ప్రపంచమంతా తరలివస్తున్న వేళ భారతదేశ ప్రాచీన కళాత్మకత, సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తుందని ట్వీట్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ ఏడాది జీ-20 సమావేశాలకు భారత్ అతిథ్యం ఇస్తోంది. జి20 కోసం.. దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఢిల్లీలోని కీలక భవనాలు, రోడ్లు విద్యుత్ కాంతులతో దగదగలాడుతున్నాయి. వెయ్యి కాంతులతో మెరిసిపోతున్నాయి. సమావేశాల సందర్భంగా ఢిల్లీ వ్యాప్తంగా కేంద్రం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. అన్ని చోట్ల భద్రతా బలగాలను మోహరించారు. డెలిగెట్స్ బస చేసే భవనాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లను కూడా మూసివేయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..