Parliament Special Session: మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు..
New Parliament Building: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) బిల్లు, కామన్ సివిల్ కోడ్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇలా అనేక కీలక అంశాలపై చర్చించేందుకే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతోందని ప్రచారం జరిగింది. అంతేకాదు ఈ ప్రత్యేక సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం దేశం పేరును ఇండియా స్థానంలో భారత్‌గా మారుస్తూ తీర్మానం చేయబోతోందని కూడా కథనాలు వెలువడుతున్నాయి.

New Parliament Building: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) బిల్లు, కామన్ సివిల్ కోడ్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇలా అనేక కీలక అంశాలపై చర్చించేందుకే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతోందని ప్రచారం జరిగింది. అంతేకాదు ఈ ప్రత్యేక సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం దేశం పేరును ఇండియా స్థానంలో భారత్‌గా మారుస్తూ తీర్మానం చేయబోతోందని కూడా కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా, అనేక రాజ్యాంగ సవరణలు కూడా చేపడతారని, ఇంకా ఎన్నో సంచలనాలు జరగబోతున్నాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆసక్తికర అప్‌డేట్స్ వెలుగులోకి వచ్చాయి. అయితే, పార్లమెంటు సమావేశాలకు సంబంధించిన తేదీలను కూడా కేంద్ర వెల్లడించింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈనెల 18 నుంచి 22 వరకు జరుగుతాయని పేర్కొంది. ఈ నెల 18 నుంచి 22 వరకు.. ఐదు రోజుల పాటు జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తాజాగా వచ్చిన ఆసక్తికర సమాచారం ఏంటంటే.. అమృత కాలంలో కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభించుకోవడమే మోదీ ఒన్ అండ్ ఓన్లీ అజెండా అని పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 18న పార్లమెంట్ పాత భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. యి. వినాయక చవితిని పురస్కరించుకొని సెప్టెంబర్ 19 నుంచి ఈ సమావేశాలను కొత్త భవనంలోకి మారుస్తారు. అయితే, కొత్త పార్లమెంట్ భవనంలో వినాయక చవితి సందర్భంగా 18న ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయి.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ప్రధానికి సోనియా గాంధీ లేఖ..
ఇదిలాఉంటే.. ప్రత్యేక సమావేశాల వెనుక ఎజెండా ఏంటో చెప్పాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కీలకమైన తొమ్మిది అంశాలు చర్చించాలని కోరడంతోపాటు.. అజెండా ఎంటో చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారని ఆమె లేఖలో పేర్కొన్నారు. అజెండా ఏంటో కూడా తమకు చెప్పలేదని ప్రస్తావించారు. ఈ సమావేశాల్లో తాము పాల్గొంటామని చెప్తూ తొమ్మిది అంశాలపై చర్చించాలని సూచించారు. ధరల పెరుగుదల, దేశంలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న నిరుద్యోగం, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతులకు MSP, ఆదానీ లావాదేవీలపై JPC ఏర్పాటు, మణిపూర్‌లో రాజ్యాంగ వ్యవస్థ వైఫల్యంపై చర్చ, హర్యానాలో మతఘర్షణలు, చైనా ఆక్రమణలు, కుల ఆధారిత జనాభా లెక్కలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, కరువు, వరదల ప్రభావంపై చర్చించాలని రెండు పేజీల లేఖలో సోనియా గాంధీ కోరారు. నిర్మాణాత్మక సహకారంలో భాగంగా ఈ అంశాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చేపడతారని సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.
స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తి చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న పాతికేళ్ల కాలాన్ని అమృత్ కాలంగా కేంద్రం చెబుతోంది. ఈ మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను కూడా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెడుతారా ? లేక దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మారుస్తూ బిల్లును తెస్తారా ? అన్నవిషయంపై తీవ్ర ఉత్కంఠతోపాటు.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల ఏజెండాపై సస్పెన్ కొనసాగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..