AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Summit: అతిథి దేవో భవ.. G20 ప్రతినిధులకు ఎలాంటి కంచాల్లో భోజనం అందించనున్నారంటే..?

భారత్‌లో కనీవినీ ఎరుగని రీతిలో జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 9, 10 తేదీల్లో జరిగే జి-20 సదస్సుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం జీ-20 సదస్సుపై ప్రపంచం మొత్తం చూపు భారత్‌పైనే ఉంది. ఇందులో పలు దేశాల అధినేతలు పాల్గొననున్నారు. అతిథులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

G20 Summit: అతిథి దేవో భవ.. G20 ప్రతినిధులకు ఎలాంటి కంచాల్లో భోజనం అందించనున్నారంటే..?
G20 Summit 2023
Shaik Madar Saheb
|

Updated on: Sep 06, 2023 | 6:21 PM

Share

భారత్‌లో కనీవినీ ఎరుగని రీతిలో జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 9, 10 తేదీల్లో జరిగే జి-20 సదస్సుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం జీ-20 సదస్సుపై ప్రపంచం మొత్తం చూపు భారత్‌పైనే ఉంది. ఇందులో పలు దేశాల అధినేతలు పాల్గొననున్నారు. అతిథులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో అతిథుల బస ఏర్పాటు నుంచి రకరకాల వంటకాలు వడ్డించడం వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భారతీయ సంస్కృతిలో అతిథి దేవో భవ.. అంటే అతిథిని దేవతలా భావించి వారికి ఆతిథ్యం ఇస్తారన్నమాట.. భారతదేశంలో ఆతిథ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి పరిస్థితిలో, G-20 సమ్మిట్‌కు హాజరయ్యే అతిధుల గౌరవానికి తగినట్లు.. ఆతిథ్యం విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి అవకాశ ఎటువంటి అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు..

అయితే, జీ20 సదస్సుకు హాజరయ్యే వారికి ఆహారాన్ని అందించే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉండనుంది. తద్వారా సకల సౌకర్యాలు.. ఆతిథ్యాన్ని స్వీకరించిన అతిథులు ఎన్నటికీ.. ఎప్పటికీ మరచిపోలేని విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశిష్ట అతిథులందరికీ వెండి పాత్రల్లో భోజనం వడ్డించనున్నారు. భారత్ ఆహారాన్ని వడ్డించే విధానంలో సంస్కృతి, వారసత్వం, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పనుంది. అందుకే అతిథులకు వెండి పాత్రల్లో భోజనం వడ్డించడంతోపాటు.. రకరకాల వంటలను సిద్ధం చేయనున్నారు.

200 మంది కళాకారుల కృషి..

అతిథుల కోసం ఏర్పాట్లను సిద్ధం చేయడంపై కళాకారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒక్కో డిజైన్ వెనుక ఒక్కో ఆలోచన ఉంటుంది. ఇందులో భారతీయత సంప్రదాయం కనిపించేలా ప్రత్యేకంగా తయారు చేశారు. వీటిలో భారత సంస్కృతి సంప్రదాయాలన్నీ కనిపించనున్నాయి. ఈ పాత్రల తయారీలో 200 మంది కళాకారుల శ్రమ ఉంది. కర్నాటక, బెంగాల్, ఉత్తరప్రదేశ్, జైపూర్, ఉత్తరాఖండ్ వంటి వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఈ పాత్రల తయారీలో పనిచేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వెండి పాత్రలను జైపూర్ కంపెనీ ఐఆర్ఐఎస్ తయారు చేసింది. హస్తకళాకారులు అహోరాత్రులు కష్టపడి ఈ పాత్రలను తయారు చేశారు. ఈ పాత్రల సెట్ ఫ్యూజన్ సొబగుల థీమ్‌పై రూపొందించారు.

అశోక చక్రం ఆకారంలో..

అతిథుల కోసం ప్రత్యేకంగా డిన్నర్ సెట్‌ను సిద్ధం చేశారు. ఉప్పు ట్రేలో అశోక చక్ర చిత్రం ఉండడం దీని ప్రత్యేకత. డిన్నర్ సెట్‌లో వెండి వస్తువులు, బంగారు పూత పూసిన గిన్నెలు, సాల్ట్ స్టాండ్, స్పూన్ ఉన్నాయి. గిన్నె, గ్లాస్, ప్లేట్‌కు రాయల్ లుక్ ఇచ్చారు. దీనితో పాటు, ట్రేలు, ప్లేట్లలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు కనిపిస్తాయి. ఇది కాకుండా, ఫుడ్ ప్లేట్‌లో హస్తకళల అందమైన కళాకృతి కూడా కనిపించనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..