Big News Big Debate: విజ్ఞానమా? అంధ విశ్వాసమా?.. సనాతన ధర్మానికి మతానికి మధ్య బంధమేంటి?
Big News Big Debate: సనాతన ధర్మం అంశంపై దేశ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను బీజేపీ సహా.. ఆధ్యాత్మిక వేత్తలు ఖండిస్తున్నారు. ఇది రాజకీయ రచ్చకు దారితీసింది. అసలు ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారు..
Big News Big Debate: సనాతన ధర్మం అంశంపై దేశ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను బీజేపీ సహా.. ఆధ్యాత్మిక వేత్తలు ఖండిస్తున్నారు. ఇది రాజకీయ రచ్చకు దారితీసింది. అసలు ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారు..
ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే..
”కొన్ని విషయాలను కేవలం వ్యతిరేకిస్తే సరిపోదు. వాటిని పూర్తిగా నిర్మూలించాలి. దోమలు, డెంగీ జ్వరాలు, మలేరియా, కరోనా వంటి వాటిని మనం వ్యతిరేకిస్తేపోవు. నిర్మూలించాలి. అలాగే సనాతనం కూడా.”
‘‘మనం చేయాల్సిన మొదటి పని సనాతనాన్ని రూపుమాపడం. సనాతనం అనే మాట సంస్కృతం నుండి వచ్చింది. ఈ మాటకు అర్థం శాశ్వతమైనది అంటే ఎప్పటికీ మారనిది. దానిని ఎవరూ మార్చలేరు, ప్రశ్నించలేరు. కానీ, సనాతనం ప్రజలను కులం పేరుతో విడదీస్తుంది.”
”సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విడదీసే సిద్ధాంతమని తాను గట్టిగా నమ్ముతున్నా.”
”సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని కాపాడటమే” – ఉదయనిధి స్టాలిన్
దీనిపై రాజకీయ నాయకులు ఏమన్నారంటే..
”ఉదయనిధి కేవలం సనాతన ధర్మాన్ని మాత్రమే అవమానించలేదు. అన్ని ధర్మాలను అవమానించారు. ఐదు రోజులు అయినా రాహుల్ దీనిపై ఎందుకు స్పందించలేదు” –ప్రకాష్ జావదేకర్, మాజీ మంత్రి
‘‘మేం అన్ని మతాల ధర్మాలను విశ్వసిస్తాం. ప్రతి రాజకీయ పార్టీకి వారి అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి నమ్మకాలను మేం గౌరవిస్తాం’’-కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి
‘‘ముస్లింలు, మిషనరీలు, బ్రిటీష్ వారి చేతుల్లో సనాతన ధర్మం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ధర్మం శాశ్వతమైనది. ఇదే గెలిచింది. మొఘలలు, బ్రిటీష్ వారు దేశం విడిచిపెట్టి పోయారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని మాట్లాడిన వారే తుడిచిపెట్టుకుపోయారు’’ –అలోక్‌కుమార్, వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్
బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..