Telangana: చేయని నేరానికి.. 25 ఏళ్ళుగా దుబాయ్ జైల్లో సిరిసిల్ల వాసులు.. విడుదల చేసేందుకు ప్రభుత్వ ప్రయత్నం..

Telangana: ఎలాగైనా జైల్లో మగ్గుతున్న తమ వారిని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని బాధిత కుటుంబాలు కోరుకుంటున్నారు. తాము ఈ హత్య చేయలేదని పాకిస్తాన్ దేశియులు హత్య చేసారని.. బాధితుల తరుపున న్యాయ వాదులు అంటున్నారు.. వీరిని విడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నామని కేటీర్ చెప్పారు.

Telangana: చేయని నేరానికి.. 25 ఏళ్ళుగా దుబాయ్ జైల్లో సిరిసిల్ల వాసులు.. విడుదల చేసేందుకు ప్రభుత్వ ప్రయత్నం..
Ktr Meets Uae Officials
Follow us
G Sampath Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 07, 2023 | 4:36 PM

కరీంనగర్, సెప్టెంబర్07:  చేయని నేరానికి 25 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చింది. దుబాయ్ జైల్లో తెలంగాణ వాసులు పడరాని కష్టాలు పడుతున్నారు. వారిని విడిపించేందుకు ప్రభుత్వం కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. దేశం కానీ దేశంలో తమవారు జైల్లో ఎలా ఉన్నారో తెలియక బాధితుల కుటుంబ సభ్యులు కన్నీళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇది కథకాదు..రాజన్న సిరిసిల్ల వాసుల కన్నీటి గాథ..ఉపాధి కోసం విదేశాలకు వెళ్తే.. జైలు జీవితాన్ని గడుపుతున్నారు సిరిసిల్ల వాసులు. ఒక్క వ్యక్తి హత్య కేసు లో.. నిందితులుగా జిల్లా వాసులను చేర్చారని వారి కుటుంబీకులు రోధిస్తూ చెప్పారు. అక్కడి బాషా రాక.. అక్కడి చట్టాలు తెలియక జైల్లో మగ్గుతున్నారని వాపోయారు. వారిని విడిపించేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం తో పాటు అటు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నేపాలి హత్య కేసులో వీరిని దోషులుగా తెల్చింది అక్కడి కోర్టు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూర్ గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం, రవి చెందిన ఇద్దరు అన్నదమ్ములు, చందుర్తి మండలానికి చెందిన ఇద్దరు గోళం నాంపల్లి, శివరాత్రి హనుమండ్లు, కొనరావుపేట గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మణ్ దుబాయ్ కి వెళ్ళారు. వెళ్లిన ఆరు నెలల అనంతరం నేపాల్ కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ హత్యకు గురయ్యాడు. అక్కడే పని చేస్తున్న జిల్లా వాసులు ఈ ఐదుగురు కేసులో ఇరుక్కున్నారు భాష సరిగా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు కానీ శిక్ష రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట పదేళ్లు జైలు శిక్ష వేశారు అనంతరం… 25 ఏళ్ల శిక్ష విధించింది. దుబాయ్ చట్టాల ప్రకారం హత్య గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమా భిక్ష పెడితే విడుదల అవకాశం ఉండగా 2011లో ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ తీసుకొని ఒకసారి నేపాల్ కూడా వెళ్లి వచ్చారు. హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ, ఇతర ప్రతినిధుల సహకారంతో సంతకాలు చేయించారు. వారికి ఆర్థికంగా కేటీఆర్ పదిహేను లక్షల రూపాయల చెక్కును అందించారు. అప్పుడే దుబాయ్ లో చట్టాలు మారడంతో విడుదల గగనమైంది. వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టి వేసింది.

ఇవి కూడా చదవండి
Telangana Prisoners

సెప్టెంబర్ లో మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో కేసు వేయించడం, కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ సాధించి ఈ కేసులో క్షమాభిక్ష కోరడం కోసం.. కానీ అదే సమయం లో మంత్రి కేటీఆర్‌ కాలుకు ఫ్రాక్చర్ కావడంతో దుబాయ్ వెళ్ళలేక పోయాడు. అనంతరం బాధిత కుటుంబాలను కూడా దుబాయ్ తీసుకు వెళ్లేందుకు గత సంవత్సరం అందరికీ పాస్‌పోర్ట్‌ తీసుకుని వెళ్లాల్సి ఉండగా మంత్రి కేటీఆర్ కాలుకి ఫ్రాక్చర్ అవ్వడం తో దుబాయ్ పర్యటన రద్దైంది. దుబాయ్ చట్టాలు తరుచూ మారడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా జైల్లో మగ్గుతున్న తమ వారిని తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని బాధిత కుటుంబాలు కోరుకుంటున్నారు. తాము ఈ హత్య చేయలేదని పాకిస్తాన్ దేశియులు హత్య చేసారని.. బాధితుల తరుపున న్యాయ వాదులు అంటున్నారు.. వీరిని విడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నామని కేటీర్ చెప్పారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.