ఓల్డ్ సిటీలో గోల్‌మాల్.. ఫంక్షన్ హాల్ మాటున మిడ్‌నైట్ హోటల్… ఇక్కడ్నుంచే పక్కా స్కెచ్..!
మరోవైపు ఇదే ప్రాంతంలో ఈ మధ్యకాలంలో జరిగిన క్రైమ్‌ల్లో కొన్ని హత్యలు, హత్యాయత్న కేసులు ఏకంగా రాష్ట్రాన్నే కుదిపి వేశాయి. కొన్ని రోజుల క్రితమే రాష్ట్ర హోంమంత్రి ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. పాతబస్తీ బార్కస్ పహాడీ షరీఫ్ బండ్లగూడ చాంద్రయణగుట్ట పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు...ఇతర ప్రాంతాల నుంచి
పాత బస్తీలో రోజురోజుకు పెరుగుతున్న క్రైమ్ పై ఉన్నత స్థాయి అధికారులు ఫోకస్ చేశారు. అసలు పాతబస్తీలో ఎందుకు నేరాలు పెరుగుతున్నాయి.. అనే అంశం పైన ఆరా తీస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి…365 రోజులు రద్దీగా ఉండే ఒక ఫంక్షన్ హాల్ పైన బండ్లగూడ ఇన్స్పెక్టర్ షాకిర్ అలీ తన సిబ్బందితో దాడులు చేసి ఒక పెద్ద రహస్యాన్ని ప్రపంచానికి చూపించారు. ఫంక్షన్ హాల్ ముసుగులో లోపల ఫైవ్ స్టార్ హోటల్లో లాంటి సదుపాయాలతో కూడిన అక్రమంగా హోటల్ నడుపుతున్నారు. పాతబస్తీ బార్కస్ ఏరియాలో నాన్ వెజ్ విదేశీ ఫుడ్ తోపాటు వందల కొద్ది వెరైటీలు ఈ ప్రాంతంలో దొరుకుతూ ఉంటాయి. దేశ విదేశాల నుంచి కాకుండా అరబ్ దేశస్తులు ఇక్కడకు ఎక్కువగా వస్తూపోతూ ఉంటారు. విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రాంతానికి రావడంతో పాతబస్తీలో విదేశీ ఫుడ్ హోటల్స్ ఎక్కువ నడుస్తుంటాయి.
మరోవైపు ఇదే ప్రాంతంలో ఈ మధ్యకాలంలో జరిగిన క్రైమ్‌ల్లో కొన్ని హత్యలు, హత్యాయత్న కేసులు ఏకంగా రాష్ట్రాన్నే కుదిపి వేశాయి. కొన్ని రోజుల క్రితమే రాష్ట్ర హోంమంత్రి ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. పాతబస్తీ బార్కస్ పహాడీ షరీఫ్ బండ్లగూడ చాంద్రయణగుట్ట పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు…ఇతర ప్రాంతాల నుంచి యువకులు ఇక్కడకు వచ్చి పెద్ద పెద్ద ప్లానింగ్లు చేసి నేరాలకి పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఇక్కడ వందలకొద్దీ యువకుల్ని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు…కొంతమంది యువకులైతే పోలీసులను చూసి మేము ఫంక్షన్ కి వచ్చామని చెప్పారు. కొంతమంది యువకులైతే మేము ఫంక్షన్ హాల్ కి వచ్చి డబ్బులు ఇచ్చి డిన్నర్ చేస్తున్నామని చెప్పారు…ఇన్స్పెక్టర్ వందల కొద్ది యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ నుంచి పంపి వేసిన తర్వాత అక్రమంగా నిర్వహిస్తున్న హోటల్ యజమానిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..