AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచిర్యాలలో విషాదం: పొట్టకూటి కోసం వలస వస్తే.. పొట్టన పెట్టుకున్న వ్యాన్!

తుకు దెరువు‌కోసం ఏడేళ్ల‌ కొడుకుతో కలిసి ఊరు కాని‌ ఊరు వలసొచ్చారు. ఓ యజమాని వద్ద డైరీ ఫాంలో పనికి‌ కుదిరారు. ఒక్కగానొక్క కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నత చదువులు చదించాలన్న ఆశతో ఆ భార్యభర్తలిద్దరూ రెండేళ్లుగా అక్కడే జీవనం సాగిస్తున్నారు. కొంత డబ్బు చేతికి‌ రావడంతో ఓ సారి‌ స్వగ్రామం వెళ్లొద్దామని బయలుదేరారు.. బస్టాండ్ లో‌ని కుర్చీ మీద కూచోని బస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే..

మంచిర్యాలలో విషాదం: పొట్టకూటి కోసం వలస వస్తే.. పొట్టన పెట్టుకున్న వ్యాన్!
Van Overturned On Father And Son
Naresh Gollana
| Edited By: Srilakshmi C|

Updated on: Sep 07, 2023 | 4:35 PM

Share

మంచిర్యాల, సెప్టెంబర్ 7: బ్రతుకు దెరువు‌కోసం ఏడేళ్ల‌ కొడుకుతో కలిసి ఊరు కాని‌ ఊరు వలసొచ్చారు. ఓ యజమాని వద్ద డైరీ ఫాంలో పనికి‌ కుదిరారు. ఒక్కగానొక్క కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నత చదువులు చదించాలన్న ఆశతో ఆ భార్యభర్తలిద్దరూ రెండేళ్లుగా అక్కడే జీవనం సాగిస్తున్నారు. కొంత డబ్బు చేతికి‌ రావడంతో ఓ సారి‌ స్వగ్రామం వెళ్లొద్దామని బయలుదేరారు.. బస్టాండ్ లో‌ని కుర్చీ మీద కూచోని బస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే మృత్యువులా దూసుకొచ్చిన ఓ వ్యాన్ క్షణాల్లో ఆ తండ్రి కొడుకులను పొట్టన పెట్టుకుంది. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన వ్యాన్ ఆ పక్కనే ఉన్న తండ్రి కొడుకుల మీద పడటంతో అక్కడికక్కడే ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు వద్ద చోటు చేసుకుంది. విధి ఆడిన వింత‌నాటకంలో మెదక్ నుండి పొట్ట కూటి‌కోసం వలసొచ్చిన కుటుంబం బలైంది.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు బస్ స్టాప్ వద్ద అతివేగంగా వచ్చిన ఓ ఐచర్ వ్యాన్ బస్ స్టాప్ పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ప్రయాణికుల మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో మెదక్ జిల్లా అనంతారం గ్రామానికి తండ్రి కొడుకులిద్దరు అక్కడికక్కడే చనిపోయారు. జన్నారం మండలం మందపల్లి గ్రామంలోని ఓ డైరీ ఫామ్ లో పని చేసేందుకు వలస వచ్చింది జోగు సాయికుమార్ (37) – మంజుల , జోగు లక్ష్మణ్ (07) కుటుంబం. చాలా రోజుల తర్వాత సాయి , లక్ష్మణ్ తండ్రి కొడుకులిద్దరు కలిసి తమ సొంత గ్రామానికి వెళ్లడానికి కలమడుగు బస్టాప్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తుండగా.. మృత్యువు లా దూసుకొచ్చిన‌ ఓ ఐచర్ వ్యాన్ ( TS 21 T 9092 ) ఆ ఇద్దరి‌ ప్రాణాలను బలి తీసుకుంది.

ఒక్కసారిగా రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంబాన్ని ఢీకొట్టి పక్కనే బస్ కోసం ఎదురు చూస్తున్న సాయికుమార్, లక్ష్మణ్ లపై బోల్తా పడింది. దీంతో ఆ ఇద్దరు తండ్రి కొడ్డుకులు అక్కడికక్కడే చనిపోయారు. మృతి చెందిన భర్త కుమారుని వద్ద భార్య బోరున విలపించడం స్థానికులను‌ కలచి వేసింది. బ్రతుకు‌దెరువు కోసం వచ్చి‌ భర్త బిడ్డను కోల్పోయానే అంటూ భార్య మంజుల కన్నీరుమున్నీరైంది. ఈ ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు‌ చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.