AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC JL 2023 Hall Tickets Download: తెలంగాణ జూనియర్‌ లెక్చరర్ పోస్టులకు హాల్ టికెట్లు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈనెలలో నియామక రాత పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా మొత్తం 1392 జూనియర్‌ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఈ నియామక ప్రక్రియ..

TSPSC JL 2023 Hall Tickets Download: తెలంగాణ జూనియర్‌ లెక్చరర్ పోస్టులకు హాల్ టికెట్లు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి
TSPSC JL hall tickets
Srilakshmi C
|

Updated on: Sep 06, 2023 | 3:11 PM

Share

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈనెలలో నియామక రాత పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు తాజాగా విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా మొత్తం 1392 జూనియర్‌ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు జరగనున్నాయి. దాదాపు 11 రోజులపాటు ఆయా తేదీల్లో 16 సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

ఒక్కోరోజు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు ఉంటాయి. ఉదయం జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్ష జరగుతుందని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వివరించింది కూడా. తెలంగాణలో ఇంత భారీ మొత్తంలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. 2008లో ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో 1100 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి గరిష్ఠంగా 1392 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ నెల 12 నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు నిర్వహించనున్న రాత పరీక్షలకు సరిగ్గా వారం రోజుల ముందు హాల్‌టికెట్లను కమిషన్‌ అందుబాటులో ఉంచింది. ఒకే అభ్యర్థి రెండు మూడు సబ్జెక్టులకు దరఖాస్తు చేసినట్లయితే సబ్జెక్టు వారీగా వేరు వేరు హాల్‌టికెట్లను పొందాలని కమిషన్‌ సూచించింది. అన్ని సబ్జెక్టులకు ఒకే హాల్‌ టికెట్‌ ఉండని స్పష్టం చేసింది. జేఎల్‌కు సంబంధించి అభ్యర్థులు నమూనా పరీక్షలు రాయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. అందుకు సంబంధించిన లింక్‌ను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ జూనియర్‌ లెక్చరర్ రాత పరీక్షకు సబ్జెక్టుల వారీగా పరీక్షలు జరిగే తేదీలు ఇవే..

  • ఇంగ్లిష్‌ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 12, 2023
  • ఎకనామిక్స్‌, వృక్షశాస్త్రం పరీక్ష తేదీ: సెప్టెంబర్ 13, 2023
  • మ్యాథమెటిక్స్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 14, 2023
  • కెమిస్ట్రీ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 20, 2023
  • తెలుగు పరీక్ష తేదీ: సెప్టెంబర్ 21, 2023
  • ఫిజిక్స్‌, జంతుశాస్త్రం పరీక్షతేదీ: సెప్టెంబర్ 22, 2023
  • కామర్స్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 25, 2023
  • సివిక్స్, అరబిక్, ఫ్రెంచ్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 26, 2023
  • హిందీ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 27, 2023
  • హిస్టరీ, సంస్కృతం పరీక్ష తేదీ: సెప్టెంబర్ 29, 2023
  • ఉర్దూ పరీక్ష తేదీ: అక్టోబర్‌ 3, 2023

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

సింగపూర్‌లో భారతీయ 100 రూపాయల విలువ ఎంత?
సింగపూర్‌లో భారతీయ 100 రూపాయల విలువ ఎంత?
త్వరలోనే భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య బిగ్ డిఫెన్స్‌ డీల్‌..!
త్వరలోనే భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య బిగ్ డిఫెన్స్‌ డీల్‌..!
స్టార్ ప్లేయర్‌ను ఇంటికి పంపేసిన యూఏఈ.. కారణం IND, PAK సమస్యేనా?
స్టార్ ప్లేయర్‌ను ఇంటికి పంపేసిన యూఏఈ.. కారణం IND, PAK సమస్యేనా?
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రా
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రా
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా? ఎవరెవరికి ఇస్తారు?
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా? ఎవరెవరికి ఇస్తారు?
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దుమ్మురేపిన ఎమ్మెల్యే మైథిలి..!
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దుమ్మురేపిన ఎమ్మెల్యే మైథిలి..!
ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే..
ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం
దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం
రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు..
రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు..