TS Gurukul Posts: గురుకుల పోస్టుల తుది అన్సర్ ‘కీ’లు వెల్లడి.. స్లాట్ విధానంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన
రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ వేగంగా కదులుతోంది. ఇప్పటికే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన తుది ఆన్సర్ కీలను కూడా గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ మినహా మిగతా అన్ని పోస్టులకు సంబంధించిన తుది ఆన్సర్ ‘కీ’లను వెల్లడించింది. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు సంబంధించి..
హైదరాబాద్, సెప్టెంబర్ 7: రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ వేగంగా కదులుతోంది. ఇప్పటికే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన తుది ఆన్సర్ కీలను కూడా గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ మినహా మిగతా అన్ని పోస్టులకు సంబంధించిన తుది ఆన్సర్ ‘కీ’లను వెల్లడించింది. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు సంబంధించి న్యాయవివాదం ముగిసిన తర్వాత ఆయా పోస్టులకు కూడా తుది కీ ప్రకటించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, డీఎల్, జేఎల్, టీజీటీ పోస్టులకు బోర్డు తుది కీలు ప్రకటించింది. తుది కీపై ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించబోమని బోర్డు స్పష్టం చేసింది.
ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ ముకింగ్ విధానం
ఈ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని గురుకుల నియామక బోర్డు భావిస్తోంది. ఇటీవల నిర్వహించిన సీబీటీ రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను సిద్ధం చేయనున్నారు. అందుకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు తమకు నచ్చిన తేదీలో కోరుకున్న సమయంలో వచ్చే అవకాశం కల్పించనున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ ప్రక్రియ కొనసాగనుంది. గడువు తేదీ వరకు ప్రతి రోజూ పరిమిత సంఖ్యలో స్లాట్లు ఇచ్చేలా షెడ్యూల్ సిద్ధం చేస్తోంది.
ఇక త్వరలోనే డిగ్రీ, జూనియర్ లెక్చరర్, పీజీటీ పోస్టులకు సంబందించిన ఫలితాలు బోర్డు వెల్లడించనుంది. ఈ ఫలితాలో మెరిట్ ప్రాతిపదికన 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడించనున్నారు. అనంతరం ద్రువపత్రాల పరిశీలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించాలని బోర్డు భావిస్తోంది. పీజీ అర్హత కలిగిన డిగ్రీ, జూనియర్ లెక్చరర్, పీజీటీ పోస్టులకు ద్రువపత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత టీజీటీ పోస్టుల షెడ్యూల్ ప్రకటిస్తారు. ఈ నెలంతా టీఎస్‌పీఎస్సీ పరీక్షలు ఉండటంతో గురుకుల పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు వీటికి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానం తీసుకువస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా ద్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి లాగిన్ అయ్యి ఏ రోజున ఏ సమయంలో పరిశీలనకు వస్తున్నారో ముందుగానే స్లాట్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఐతే స్లాట్ బుక్ చేసుకున్న తేదీన అభ్యర్ధులు తప్పనిసరిగా అన్ని రకాల సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.