AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC ESE 2024 Notification: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే..

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ).. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌లతో సహా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ..

UPSC ESE 2024 Notification: యూపీఎస్సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే..
UPSC ESE 2024
Srilakshmi C
|

Updated on: Sep 07, 2023 | 7:46 PM

Share

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ).. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌లతో సహా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో మొత్తం 167 పోస్టులను ఈ ఏడాది భర్తీ చేస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

అర్హతలు ఏం ఉండాలంటే..

ఏదైనా గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, బీఈ/బీటెక్ లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ (ఎ, బి విభాగాలు) ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2, 3 అర్హత లేదా ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి గ్రాడ్యుయేట్ మెంబర్‌షిప్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ ఎలక్ట్రానిక్స్‌/రేడియో ఫిజిక్స్‌/రేడియో ఇంజినీరింగ్‌ విభాగంలో ఎంఎస్సీలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు వయసు జనవరి 1, 2024వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 26, 2023వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ఆన్ లైన్ విధానంలో పార్ట్ 1, పార్ట్ 2 అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.200 చెల్లించాలి. మహిళా/ ఎస్సీ /ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. స్టేజ్‌-1లో ప్రిలిమినరీ ఉంటుంది. స్టేజ్‌ 2లో మెయిన్‌ నిర్వహిస్తారు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్‌ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. స్టేజ్‌ 3లో పర్సనాలిటీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. వీటి ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 6, 2023
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 26, 2023
  • దరఖాస్తు సవరణ తేదీలు: సెప్టెంబర్ 27, 2023 నుంచి అక్టోబర్‌ 3, 2023 వరకు
  • ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 18, 2024

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us