ఆమె మంచంపై నుంచి కింద‌ప‌డింది.. కంగారుగా అగ్నిమాప‌క శాఖకు ఫోన్‌ చేసిన కుటుంబ స‌భ్యులు! సంగతేమంటే..

మంచం మీద నుంచి కింద పడితే మీరైతే ఏం చేస్తారు.. అటూఇటూ చూసి ఎవరూ చూడకపోతే లేచి మళ్లీ మంచం ఎక్కేస్తారు అంతే కదా.. కానీ ఓ మ‌హిళ‌ అనుకోకుండా మంచం మీద నుంచి కింద పడిపోయిందండి. అంతే జిల్లా మొత్తం ఉలిక్కిపడింది. అదేంటీ..? అని అనుకుంటున్నారా? అవునండీ.. ఆవిడను తిరిగి మంచం మీదకు ఎక్కించడానికి కుటుంబ సభ్యులు ఏకంగా అగ్నిమాపక సిబ్బందిని పిలిపించారు. ప్ర‌మాద‌వ‌శాత్తు మంచం..

ఆమె మంచంపై నుంచి కింద‌ప‌డింది.. కంగారుగా అగ్నిమాప‌క శాఖకు ఫోన్‌ చేసిన కుటుంబ స‌భ్యులు! సంగతేమంటే..
Maharashtra Woman Falls From Bed
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 07, 2023 | 5:27 PM

ముంబాయి, సెప్టెంబర్ 7: మంచం మీద నుంచి కింద పడితే మీరైతే ఏం చేస్తారు.. అటూఇటూ చూసి ఎవరూ చూడకపోతే లేచి మళ్లీ మంచం ఎక్కేస్తారు అంతే కదా.. కానీ ఓ మ‌హిళ‌ అనుకోకుండా మంచం మీద నుంచి కింద పడిపోయిందండి. అంతే జిల్లా మొత్తం ఉలిక్కిపడింది. అదేంటీ..? అని అనుకుంటున్నారా? అవునండీ.. ఆవిడను తిరిగి మంచం మీదకు ఎక్కించడానికి కుటుంబ సభ్యులు ఏకంగా అగ్నిమాపక సిబ్బందిని పిలిపించారు. ప్ర‌మాద‌వ‌శాత్తు మంచం మీద నుంచి కింద ప‌డిపోయిన మహిళను తిరిగి మంచం మీదకు చేర్చడానికి ఇంత హడావిడి అవసరమా అని అనుకుంటున్నారా? అసలు కారణం తెలిస్తే మీరు కూడా ఔరా అనేస్తారు. అసలింతకీ ఏం జరిగిందంటే..

మ‌హారాష్ట్ర‌లోని థానే ప‌ట్ట‌ణానికి చెందిన 62 ఏండ్ల మ‌హిళ బరువు దాదాపు 160 కేజీలు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె మంచానికే పరిమితమైంది. కదలిక లేకుండా మంచంపైనే ఉండేది. ఈ క్రమంలో వాగ్‌బిల్ ప్రాంతంలోని వారి ఫ్లాట్‌లో గురువారం (సెప్టెంబర్‌ 7) ఉదయం 8 గంటలకు మంచంపై నిద్రిస్తున్న సమయంలో ఆమె ప్ర‌మాద‌వ‌శాత్తు మంచం మీద నుంచి కింద ప‌డిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆమెను పైకి లేపి మంచంపై ప‌డుకోబెట్టేందుకు కుటుంబ స‌భ్యులు విశ్వప్రయత్నం చేశారు. దీంతో చేసేది లేక ఆమె కుటుంబ సభ్యులు థానే మున్సిపల్ కార్పొరేషన్ (TMC) సిబ్బంది స‌హాయం కోరారు.

మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆమె ఆ ఇంటికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కింద ప‌డ్డ మ‌హిళ‌ను మంచంపై తిరిగి ప‌డుకోబెట్టారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ యాసిన్ తాడ్వి మాట్లాడుతూ.. రీజనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ (ఆర్‌డీఎంసీ)కి చెందిన బృందం ఫ్లాట్‌కు చేరుకుని, మహిళను పైకి లేపి మంచంపై పడుకోబెట్టారు. బాధిత మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్నట్లు ఆయన తెలిపారు. సాధారణంగా ఆర్‌డీఎంసీకి ఎన్నో ఎమ‌ర్జెన్సీ కాల్స్ వ‌స్తుంటాయని, ఇలాంటి ఫోన్‌ కాల్‌ రావడం ఇదే తొలిసారంటూ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!