కిలో టమోటా 3 రూపాయలే.. కొనేవారు లేక రైతుల కడుపు మండింది.. కట్ చేస్తే!

అప్పుడు కొనబోతే కొరివి... ఇప్పుడు అమ్మబోతే అడివి.. అపరిచితుడిలా మారి... డబుల్ షేడ్స్‌తో వీరలెవల్లో పెర్ఫామెన్స్ చూపిస్తోంది టమాటా. ఎస్‌... మొన్నటిదాకా బీరువాలో భద్రంగా దాచుకున్న టమాటా ఇప్పుడు రోడ్డు పక్కన అనాధలా పడుంది. రూపాయికీ అర్థణాకు అమ్ముడుపోతూ..

కిలో టమోటా 3 రూపాయలే.. కొనేవారు లేక రైతుల కడుపు మండింది.. కట్ చేస్తే!
Tomato
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 07, 2023 | 7:41 PM

అప్పుడు కొనబోతే కొరివి… ఇప్పుడు అమ్మబోతే అడివి.. అపరిచితుడిలా మారి… డబుల్ షేడ్స్‌తో వీరలెవల్లో పెర్ఫామెన్స్ చూపిస్తోంది టమాటా. ఎస్‌… మొన్నటిదాకా బీరువాలో భద్రంగా దాచుకున్న టమాటా ఇప్పుడు రోడ్డు పక్కన అనాధలా పడుంది. రూపాయికీ అర్థణాకు అమ్ముడుపోతూ.. పండించిన రైతు నోట మట్టికొడుతోంది. మొన్నటిదాకా బంగారంతో పోలిక పెట్టి చూసుకున్న టమాటా ఇప్పుడు ఎవ్వరికీ కానిదై పోయింది. కర్నూలు జిల్లా ప్యాపిలిలో టమాటాల్ని రోడ్లపై పారబోసుకుంటున్నారు రైతులు. ధర తగ్గిందంటే కొనుగోలుదారులకు గుడ్ న్యూసే. కానీ… రైతుకు మాత్రం బ్యాడ్‌ న్యూస్. ఏడుపొక్కటే తక్కువ. పెట్టుబడి తిరిగొస్తే చాలు.. లాభాలక్కర్లేదంటున్న రైతుల గోడు వర్ణనాతీతం.

టమాటా రైజ్ అండ్ ఫాల్.. అనేది ఒక ఎడతెగని మిస్టరీ. జూన్ ఆఖరులో వంద మార్క్‌ను టచ్ చేసింది కిలో టమాటా ధర. ఆ తర్వాత డబుల్‌ సెంచరీ కొట్టి.. కన్య్జూమర్లను పూర్తిగా దూరం చేసుకుంది. సరిగ్గా నెల రోజుల కిందట టమాటా ధర దిగొచ్చి తగ్గుముఖం పట్టడం మొదలైంది. ఆగస్టు మూడో వారంలో కొత్త పంట రావడంతో టమాటా కిలో ధర 70 రూపాయల దిగువకు చేరింది. టమాటా మళ్లీ కిచెన్ ఫ్రెండ్లీ ఐపోయిందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో టమాటా 20 నుంచి 30 రూపాయలు పలుకుతోంది టమాటా ధర. కానీ… మార్కెట్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా విరుద్ధం. నాలుగో వంతు ధరక్కూడా నోచుకోలేక గొల్లుమంటున్నాడు రైతు. కొనుగోలు ధరకు, అమ్మకం ధరకు మధ్య ఇంత గ్యాప్ ఎందుకున్నట్టు?

నెలన్నర కిందటిదాకా టమాటాల్ని రేషన్ షాపుల్లో అమ్మే పరిస్థితి. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు పెట్టి సబ్సిడీ కింద విక్రయాలు జరిపింది ప్రభుత్వం. కిలో టమాటా దొరికితే చాలు ఆరోజు ఆ కుటుంబానికి పండగే. టమాటాలు పండించి కోటీశ్వరులయ్యామంటూ ఓపెన్ స్టేట్‌మెంట్లిచ్చారు రైతులు. టమాటా చోరీలు పెరిగాయి. షాపులకు సెక్యూరిటీగా బౌన్సర్లను పెట్టుకున్నారు. టమాటా లారీ బోల్తా పడితే పోలీసులు పహారా కాశారు. టమాటాలతో తులాభారాలు జరిగాయి. స్మార్ట్ ఫోన్ కొంటే కిలో టమాటా ఫ్రీ అంటూ బంపరాఫర్లు.

టమాటా మార్కెట్‌ని స్టాక్‌మార్కెట్లతో పోలిక పెట్టుకున్న రోజులు ఒకప్పటివి. రెండునెలల కిందట కిలో రెండొందలున్న టమాటా ఇప్పుడు కిలో 2 రూపాయలకు పడిపోయింది. అప్పుడు కోట్లాది మంది వినియోగదారులకూ దూరమై వేధించింది. ఇప్పుడు గిట్టుబాటు ధరనివ్వకుండా రైతుల బతుకుల్ని దుర్భరం చేస్తోంది. ఇదీ టమాటా తాజా పతనావస్థ. ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టమోటా రైతుల పరిస్థితి.

Tomato

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..