Chandrababu: నో రికమండేషన్స్ అమ్మా..! ఈసారి గెలుపు గుర్రాలకే టిక్కెట్లు.. చంద్రబాబు నయా ఫార్ములా..!
అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ఊహాగానాలతో తెలుగుదేశం పార్టీ కూడా దానికి తగ్గట్లుగా ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగానే ఉన్నామని చెబుతున్న చంద్రబాబు.. ఓవైపు ప్రచారం, మరోవైపు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. యువగళం పాదయాత్రతో ఏడు నెలలకు పైగా నారా లోకేష్ జనంలోనే ఉన్నారు. అటు రెండేళ్లుగా ఏదో ఒక కార్యక్రమం ద్వారా
అమరావతి, సెప్టెంబర్ 08: వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.. ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలనే కసితో ముందుకెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ఊహాగానాలతో తెలుగుదేశం పార్టీ కూడా దానికి తగ్గట్లుగా ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగానే ఉన్నామని చెబుతున్న చంద్రబాబు.. ఓవైపు ప్రచారం, మరోవైపు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. యువగళం పాదయాత్రతో ఏడు నెలలకు పైగా నారా లోకేష్ జనంలోనే ఉన్నారు. అటు రెండేళ్లుగా ఏదో ఒక కార్యక్రమం ద్వారా బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ చంద్రబాబు కూడా జనం బాట పట్టారు. తాజాగా బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు 45 రోజుల పాటు జిల్లాల పర్యటనలో ఉన్నారు. ఇక జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్నప్పటికీ అభ్యర్దులు, ఇంచార్జిల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. అయితే టిక్కెట్ల విషయంలో గతానికంటే భిన్నంగా చంద్రబాబు ముందుకెళ్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో చివరి నిమిషం వరకూ అభ్యర్ధులను ఎంపిక చేయకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరించేవారు చంద్రబాబు. ఈసారి దీనికి భిన్నంగా ముందస్తుగానే అభ్యర్ధుల ప్రకటన చేసేస్తున్నారు. అయితే, ఈసారి అభ్యర్ధుల ఎంపికలో ఎవరి రికమండేషన్ చేసినా కుదరదని తేల్చి చెప్పేస్తున్నారట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..
గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తానని తేల్చి చెప్పేసిన టీడీపీ అధినేత..
2024 ఎన్నికల కోసం గతానికంటే భిన్నంగా చంద్రబాబు అన్ని విషయాల్లోనూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు సాధారణ ఎన్నికలంటే టీడీపీ అభ్యర్దులకు చాలా టెన్షన్ ఉండేది. కానీ ఈసారి అలాంటి పరిస్థితిని మార్చి భిన్నంగా ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్లు ప్రారంభమైన టిక్కెట్ల విషయంలో క్లారిటీ ఇచ్చేవారు కాదు. ఇదంతా ఒక ఎత్తయితే కొన్ని నియోజకవర్గాలకు ఇప్పటికీ ఇంచార్జిల నియామకం పూర్తి కాలేదు. దీంతో గ్యాప్ దొరకినప్పుడల్లా నియోజకవర్గాల వారీగా నివేదికలు తెప్పించుకుని ఇంచార్జిల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో మొత్తం 23 స్థానాలు టీడీపీ గెలుచుకోగా.. ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబుతో ఉన్నారు. ఈ సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు ఎప్పుడో కన్ఫార్మ్ చేసేసారు చంద్రబాబు. ఇక ఇంచార్జిల విషయంలో కూడా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది ఇంచార్జిల పనితీరు బాగోలేదని నివేదికలు రావడంతో వారి స్థానాల్లో కొత్తవారిని నియమిస్తున్నారు. కొత్తగా ఇంచార్జిలుగా నియమించిన వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేలా ముందుకెళ్తున్నారు. ఇక గతంలో కొంతమంది అభ్యర్ధుల విషయంలో చంద్రబాబు పార్టీలోని సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకునే వారు. సీనియర్లతో పాటు జిల్లాకు చెందిన ముఖ్య నాయకుల రికమండేషన్లతో కూడా టిక్కెట్లు ఇచ్చేవారు. అయితే ఈసారి ఇలాంటి వారికి నో ఛాన్స్ అంటున్నారు చంద్రబాబు. జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు కొంతమంది ఆశావహులు ఆయా జిల్లాల్లోని సీనియర్ నాయకులను వెంటబెట్టుకుని చంద్రబాబును కలిసేందుకు వస్తున్నారట. దీంతో చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తీసుకురావద్దంటూ నేతలను కూడా హెచ్చరిస్తున్నారట. పార్టీ అధికారంలోకి రావాలంటే నేను చెప్పింది ఖచ్చితంగా ఫాలో కావల్సిందే అని చంద్రబాబు గట్టిగానే చెబుతున్నారు. గతంలో ఎన్నికలకు ముందు వరకూ అభ్యర్ధుల ఎంపికలో నాన్చుడు ధోరణితో వ్యవహరించేవారు చంద్రబాబు. చివరి నిమిషంలో టిక్కెట్ల కేటాయింపుతో అసంతృప్తుల నుంచి ఇబ్బందులు, గ్రూపు తగాదాలు రావడంతో కొన్ని సీట్లకు ఇబ్బందులు ఎదురైన పరిస్థితులు ఉన్నాయి. ఈసారి మాత్రం ముందస్తుగానే అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి అభ్యర్ధులను ఖరారు చేయడం, మరోవైపు జిల్లాల పర్యటనల్లో కూడా అభ్యర్ధులను అప్పటికప్పుడే ప్రకటించేస్తున్నారు.
టీడీపీ సీట్లకు డిమాండ్ పెరిగిందంటున్న పార్టీ నేతలు..
అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం దూకుడుగానే ముందుకెళ్తున్నారు. జిల్లాల పర్యటనలో కూడా గ్యాప్ తీసుకుని పార్టీ సెంట్రల్ ఆఫీస్‌కు వస్తున్నారు చంద్రబాబు. అభ్యర్ధుల ఎంపిక కోసమే చంద్రబాబు మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీలైనంత త్వరగా అభ్యర్ధుల ఎంపికను పూర్తి చేసేలా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. అయితే, ఇదే సమయంలో సీట్లకు బాగా గిరాకి పెరిగిందంటున్నారు పార్టీ నేతలు. కొన్నిచోట్ల ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్ధులు పోటీ పడుతున్నారని, కొంతమంది సీనియర్లతో కలిసి వచ్చి టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టి.. తాను చేయించుకున్న సర్వేల ఆధారంగానే చంద్రబాబు అభ్యర్ధుల ఎంపిక పూర్తిచేస్తున్నారని అంటున్నారు. త్వరలోనే 175 స్థానాలకు అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసేలా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..