AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఉదయాన్నే పాలు తాగడం వల్ల లాభమా? నష్టమా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Health Tips: మీ ఆరోగ్యం బాగుండాలంటే ఉండాలంటే రోజూ పాలు తాగండి. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు A, K, D, I, ఫాస్పరస్, మెగ్నీషియం, అయోడిన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. పాలను సంపూర్ణ ఆహారంగా కూడా ఇవ్వడానికి కారణం ఇదే. ఎముకలను బలోపేతం చేయడంతోపాటు కండరాల అభివృద్ధికి పాలు చాలా ముఖ్యమైనవి. అయితే పాలు తాగడానికి సరైన సమయం తెలుసా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన సమయంలో పాలు తాగడం వల్ల..

Health Tips: ఉదయాన్నే పాలు తాగడం వల్ల లాభమా? నష్టమా? నిపుణులు ఏం చెబుతున్నారు?
Drinking Milk
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 09, 2023 | 6:25 AM

Health Tips: మీ ఆరోగ్యం బాగుండాలంటే ఉండాలంటే రోజూ పాలు తాగండి. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు A, K, D, I, ఫాస్పరస్, మెగ్నీషియం, అయోడిన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. పాలను సంపూర్ణ ఆహారంగా కూడా ఇవ్వడానికి కారణం ఇదే. ఎముకలను బలోపేతం చేయడంతోపాటు కండరాల అభివృద్ధికి పాలు చాలా ముఖ్యమైనవి. అయితే పాలు తాగడానికి సరైన సమయం తెలుసా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన సమయంలో పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయట. మరి పలను ఏ సమయంలో, ఎలా తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలు తాగడం ఎప్పుడు మంచిది?

ఆహారం తిన్న వెంటనే పాలు అస్సలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీంతో పాటు, పాలు తాగే ముందు పుల్లని పదార్థాలు లేదా పండ్లు, పెరుగు వంటి వాటిని తినకూడదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆహారం తిన్న 40 నిమిషాల తర్వాత పాలు తాగడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

గోరువెచ్చని పాలు త్రాగాలి…

గోరువెచ్చని పాలు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వృద్ధులు నిద్రించడానికి ఒక గంట ముందు పాలు తాగాలి. దీని కారణంగా, జీర్ణవ్యవస్థపై ఎక్కువ భారం ఉండదు. అదే సమయంలో, గోరువెచ్చని పాలు తాగితే అనేక వ్యాధుల ప్రమాదం నివారించబడుతుంది. అంతే కాకుండా అలసట తగ్గి మంచి నిద్ర వస్తుంది.

ఖాళీ కడుపుతో తాగొద్దు..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ కడుపుతో పాలు తాగడం మానుకోవాలి. ఏమీ తినకుండా పాలు తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ఏదైనా తిన్న తర్వాతే పాలు తాగాలని సలహా ఇస్తున్నారు. అయితే, ఇలా చేయడం చిన్న పిల్లలకు హానికరం కాదు. వారు ఎప్పుడైనా పాలు తాగవచ్చు. ఇలా చేయడం ద్వారా వారికి శక్తి లభిస్తుంది. అయితే పెద్దలు ఉదయం పూట ఏమీ తినకుండా పాలు తాగడం మానుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..