Chicken Shami Kabab: రెస్టారెంట్ స్టైల్ లో టేస్టీ చికెన్ షమీ కబాబ్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేయమంటారు!

హైదరాబాద్ ఫేమస్ వంటకాల్లో చికెన్ షమీ కబాబ్ కూడా ఒకటి. రెస్టారెంట్ లలో, హోటల్స్ లో వీటికి డిమాండ్ ఎక్కువ. క్రిస్పీగా, సాఫ్ట్ గా, టేస్టీగా బలే రుచిగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే చాలు కరిగిపోతాయి ఈ చికెన్ షమీ కబాబ్స్. అలాగే దీని కాస్ట్ కూడా ఎక్కువే. అంత కాస్ట్ పెట్టి తినడం కంటే.. ఇంట్లోనే టేస్టీగా, హెల్దీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీని సింపుల్ గా ఎలా చేయవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ చికెన్ షమీ కబాబ్స్ ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు..

Chicken Shami Kabab: రెస్టారెంట్ స్టైల్ లో టేస్టీ చికెన్ షమీ కబాబ్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేయమంటారు!
Chicken Shami Kabab
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 10, 2023 | 9:00 AM

హైదరాబాద్ ఫేమస్ వంటకాల్లో చికెన్ షమీ కబాబ్ కూడా ఒకటి. రెస్టారెంట్ లలో, హోటల్స్ లో వీటికి డిమాండ్ ఎక్కువ. క్రిస్పీగా, సాఫ్ట్ గా, టేస్టీగా బలే రుచిగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే చాలు కరిగిపోతాయి ఈ చికెన్ షమీ కబాబ్స్. అలాగే దీని కాస్ట్ కూడా ఎక్కువే. అంత కాస్ట్ పెట్టి తినడం కంటే.. ఇంట్లోనే టేస్టీగా, హెల్దీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీని సింపుల్ గా ఎలా చేయవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ చికెన్ షమీ కబాబ్స్ ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ షమీ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు:

చికెన్ – అరకేజీ, తురిమిన కొబ్బరి – 2 టేబుల్ స్పూన్లు, పచ్చి మిరపకాలు – 5 (మీ రుచికి కారం సరిపడినంత), ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, కారం – 2 టీ స్పూన్స్, గరం మసాలా – 2 టీ స్పూన్స్, అల్లం – చిన్న ముక్క, ఉప్పు – రుచికి సరిపడినంత, వెల్లుల్లి రెబ్బలు – 5 , కోడి గుడ్డు – 1, చనగ పప్పు – 3 టేబుల్ స్పూన్స్.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ఒక కుక్కర్ లో చికెన్, తురిమిన కొబ్బరి, పచ్చి మిరపకాలు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, చనగ పప్పు, కొద్దిగా నీళ్లు పోసి మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన చికెన్ తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ చికెన్ ను మిక్సీలో వేసుకుని ఒక సారి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఇందులో గుడ్డు కూడా వేసి.. మళ్లీ మరొక సారి మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ ని మీకు ఇష్టమైన షేప్స్ లో టిక్కీల మాదిరిగా చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని చికెన్ టిక్కీలను పాన్ పే వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. లేదా కావాలనుకున్న వారు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షమీ కబాబ్స్ రెడీ. ఈ రెసిపీ ఒక్కసారి తింటే.. అస్సలు వదిలి పెట్టరు. అంత టేస్టీగా ఉంటుంది మరి. ఈ కబా బ్స్ ని గ్రీన్ చట్నీ, మైనీస్ తో కానీ, టమాటా కిచప్ తో కానీ తింటే సూపర్ గా ఉంటాయి. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేయండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి