Spicy Chicken Leg Piece Fry: చికెన్ లెగ్స్ కి బాగా మసాలా పట్టించి.. ఇలా ఫ్రై చేయండి.. అదిరిపోతాయి అంతే!!

ముందుగా చికెన్ లెగ్ పీస్ లను ఓ రెండు గంటల పాటైనా మసాలు పట్టించి నాన బెట్టుకోవాలి. రాత్రంతా నానితే మరింత టేస్ట్ గా ఉంటాయి. ఆ ప్రొసెస్ చూద్దాం. చికెన్ లెగ్ పీసెస్ కు గాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో అన్ని పదార్థాలు వేసి.. బాగా కలుపుకోవాలి. ఇందులో చికెన్ లెగ్ పీసెస్ వేసి ఓ ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత కనీసం రెండు గంటల పాటైనా రెస్ట్ ఇవ్వాలి. నెక్ట్స్ చికెన్ బాగా నానిన తర్వాత.. ఓ పాన్ వేడి చేసి.. ఓ 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక చికెన్ లెగ్ పీసెస్ ను పాన్ పై వేచి వేయించుకోవాలి. వీటిని ముందుగా 10 నిమిషాల పాటు మీడియం మంటపై..

Spicy Chicken Leg Piece Fry: చికెన్ లెగ్స్ కి బాగా మసాలా పట్టించి.. ఇలా ఫ్రై చేయండి.. అదిరిపోతాయి అంతే!!
Chicken Legs Fry
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 10, 2023 | 10:00 AM

చికెన్ అంటే ఇష్టముండని వారెవరు ఉంటారు చెప్పండి. అందులోనూ చికెన్ లెగ్ పీస్ కి బాగా మసాలా పట్టించి డీప్ ఫ్రై చేసినా.. షాలో ఫ్రై చేసినా సూపర్ టేస్ట్ ఉంటాయి. వీటికి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. రెస్టారెంట్, హోటల్స్ లో కూడా చికెన్ లెగ్ పీస్ లో బోలెడన్ని వెరైటీలు ఉంటాయి. అంత ఖర్చు పెట్టి అవి తినే కంటే ఇంట్లోనే ఈజీగా, తక్కువ ఖర్చుతో, మంచి టేస్ట్ తో, హెల్దీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడూ చేసుకునే వాటితో కంటే ఇలా మసాల పెట్టి.. ఫ్రై చేయండి.. ఇక లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఈ లెగ్ పీస్ ఫ్రై బయట క్రిస్పీగా, సాఫ్ట్ గా బలేగా ఉంటాయి. మరి ఇంకెందుకు లేట్ ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దామా.

చికెన్ లెగ్ పీస్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

చికెన్ లెగ్ పీసెస్ – 6 (మీకు కావాల్సినన్ని తీసుకోవచ్చు.. అలాగే ఇప్పుడు చెప్పిన వాటిల్లో మీ రుచికి సరిపడగా క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. పెంచుకోవచ్చు) గరం మసాలా – రెండు టీ స్పూన్స్, ఉప్పు – రుచికి సరిపడా, కారం – రెండు టేబుల్ స్పూన్స్, పెరుగు – 5 స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, చాట్ మసాలా – కొద్దిగా, టమాటా కిచప్ – రెండు టీ స్పూన్స్, కొత్తి మీర, కరివేపాకు – కొద్దిగా, నిమ్మకాయ – ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 3 టీ స్పూన్స్, నూనె – సరిపడినంత.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా చికెన్ లెగ్ పీస్ లను ఓ రెండు గంటల పాటైనా మసాలు పట్టించి నాన బెట్టుకోవాలి. రాత్రంతా నానితే మరింత టేస్ట్ గా ఉంటాయి. ఆ ప్రొసెస్ చూద్దాం. చికెన్ లెగ్ పీసెస్ కు గాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో అన్ని పదార్థాలు వేసి.. బాగా కలుపుకోవాలి. ఇందులో చికెన్ లెగ్ పీసెస్ వేసి ఓ ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత కనీసం రెండు గంటల పాటైనా రెస్ట్ ఇవ్వాలి. నెక్ట్స్ చికెన్ బాగా నానిన తర్వాత.. ఓ పాన్ వేడి చేసి.. ఓ 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక చికెన్ లెగ్ పీసెస్ ను పాన్ పై వేచి వేయించుకోవాలి. వీటిని ముందుగా 10 నిమిషాల పాటు మీడియం మంటపై ఫ్రై చేసుకోవాలి.

ఆ తర్వాత సిమ్ లో పెట్టి.. చికెన్ ని అన్ని వైపులా తిప్పుకుంటూ ఓ 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ డిస్ చేసేటప్పుడు దగ్గరే ఉండటం బెటర్. ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. అలాగే అవసరమైతే నూనె కూడా వేసుకోవచ్చు. డీప్ ఫ్రై కంటే ఇలా షాలో ఫ్రై చేస్తే.. నూనె ఎక్కువగా పట్టదు. అంతే ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. దీనిపై నిమ్మ కాయ పిండుకుని తింటే.. వావ్ అనాల్సిందే. చిన్న పిల్లలే కాదు.. పెద్దవారు కూడా ఇలా చేసి పెడితే లొట్టలేసుకుంటూ తినేస్తారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వివో నుంచి మరో కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ మాములుగా లేవు
వివో నుంచి మరో కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ మాములుగా లేవు
బోనాల పండగతో పాతబస్తీలో ఉత్సాహం
బోనాల పండగతో పాతబస్తీలో ఉత్సాహం
పిల్లిని దేవతగా పూజించే వింత ఆచారం.. శుభసూచకంగా గ్రామం నడిబొడ్డున
పిల్లిని దేవతగా పూజించే వింత ఆచారం.. శుభసూచకంగా గ్రామం నడిబొడ్డున
గోదావరి ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు
గోదావరి ఉగ్రరూపం.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు
పురుషుల్లో ఈ లక్షణాలు.. టెస్టోస్టిరాన్‌ లోపానికి సంకేతాలు..
పురుషుల్లో ఈ లక్షణాలు.. టెస్టోస్టిరాన్‌ లోపానికి సంకేతాలు..
రోజు టీ తాగే అలవాటు ఉన్నవారు.. ఇత్తడి పాత్రలో తాగితే ఎన్ని లాభాలో
రోజు టీ తాగే అలవాటు ఉన్నవారు.. ఇత్తడి పాత్రలో తాగితే ఎన్ని లాభాలో
ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ నయా అప్‌డేట్..ఇక స్టేటస్ ప్రియులకు పండగే
ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ నయా అప్‌డేట్..ఇక స్టేటస్ ప్రియులకు పండగే
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు.. మోహిత్ రెడ్డికి నోటీసులు
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు.. మోహిత్ రెడ్డికి నోటీసులు
యానిమల్ సీక్వెల్ పై త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు..
యానిమల్ సీక్వెల్ పై త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు..
శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు అంటే ఏంటి.? ఇది ఎలా పనిచేస్తుంది.?
శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు అంటే ఏంటి.? ఇది ఎలా పనిచేస్తుంది.?