AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eating Raw Onions Benefits: పచ్చి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? తింటే ఏమవుతుంది?

కొన్నేళ్లుగా మనమంతా ఉదయం పూట టిఫిన్ల పేరుతో.. కార్బోహైడ్రేట్లను తింటున్నాం. అర్థం కాలేదా ? ఇడ్లీ, మినపదోసె, మైసూర్ బజ్జీ, ఉప్మా.. ఇలా రకరకాల టిఫిన్లలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. బరువు పెరగడానికి ఇవి కూడా ఒక కారణం. పోను పోను టిఫిన్లను కూడా భోజనంలా తింటుండటమే ఆరోగ్యానికి చేటు. అదే పూర్వకాలం వైపు చూస్తే.. ఈ టిఫిన్లు వాటిలోకి చట్నీలు గట్రా ఏం ఉండవ్. పొద్దున్నే చద్దన్నంలో పెరుగువేసుకుని.. అందులో ఒక పచ్చి ఉల్లిపాయ నంచుకుని తినేవారు. అదే ఆరోగ్యానికి మంచిది. తిన్నాక అందరూ కాయకష్టం..

Eating Raw Onions Benefits: పచ్చి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? తింటే ఏమవుతుంది?
Raw Onions
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 11, 2023 | 6:15 AM

Share

కొన్నేళ్లుగా మనమంతా ఉదయం పూట టిఫిన్ల పేరుతో.. కార్బోహైడ్రేట్లను తింటున్నాం. అర్థం కాలేదా ? ఇడ్లీ, మినపదోసె, మైసూర్ బజ్జీ, ఉప్మా.. ఇలా రకరకాల టిఫిన్లలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. బరువు పెరగడానికి ఇవి కూడా ఒక కారణం. పోను పోను టిఫిన్లను కూడా భోజనంలా తింటుండటమే ఆరోగ్యానికి చేటు. అదే పూర్వకాలం వైపు చూస్తే.. ఈ టిఫిన్లు వాటిలోకి చట్నీలు గట్రా ఏం ఉండవ్. పొద్దున్నే చద్దన్నంలో పెరుగువేసుకుని.. అందులో ఒక పచ్చి ఉల్లిపాయ నంచుకుని తినేవారు. అదే ఆరోగ్యానికి మంచిది. తిన్నాక అందరూ కాయకష్టం చేసేవారు. కానీ ఇప్పుడు.. మూడుపూటలా తిని.. వెంటనే గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నాం. ఇక తిన్నది ఎప్పటికి అరుగుతుంది ? ఎలా కరుగుతుంది? అందుకే మనకు ఇన్నిరోగాలు.

వాటికితోడు పాలిష్డ్ రైస్, నూనెలో వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్ కు బాగా అలవాటుపడిపోయాం. శరీరానికి కావలసిన పోషకాలు అందుతున్నాయో లేదో అస్సలు పట్టించుకోం. ఇంట్లో వాళ్లు చెప్పినా.. పెడచెవిన పెట్టేస్తాం. అలాంటి ఆహారాలు తినడం వల్ల శరీరానికి తగు మోతాదులో ఫైబర్ అందక, ప్రేగులు శుభ్రపడక వాటిలో మలం పేరుకుపోయి మలబద్ధకం సమస్య వస్తుంది. నిదానంగా మన కడుపులో ఇన్ ఫ్లమేషన్ మొదలై.. ఆరోగ్యానికి హాని చేసే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫలితంగా మలం ప్రేగుకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దానినే కోలన్ క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

కోలన్ క్యాన్సర్ బారిన పడకుండా.. ఉల్లిపాయ మనల్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇటలీ దేశానికి చెందిన సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో.. ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్లు రాకుండా ఉల్లిపాయ తగ్గిస్తుందని నిరూపితమైంది. ప్రేగులలో బ్యాక్టీరియాల వల్ల కలిగిన ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించకపోతే అక్కడ ఉండే కణజాలంలో మార్పు వచ్చి.. సాధారణ కణాలు క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంది. ఉల్లిపాయలో ఉండే ఆనియోనిన్ ఎ, ఫైసటిన్, కోసటిన్ అనే రసాయన సమ్మేళనాలు ప్రేగులలో వచ్చే ఇన్ఫెక్షన్ ను, ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

ఇవి కూడా చదవండి

ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్ల బారిన పడకుండా ఉంటాం. వంటల్లో ఎలాగూ తింటాం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ.. ఉల్లిపాయను ఉడికిస్తే అందులోనే రసాయన సమ్మేళనాల పవర్ తగ్గిపోతుంది. అందుకే పచ్చిఉల్లిపాయనే తినాలి. జన్యుపరంగా సంక్రమించే ప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా ఉల్లిపాయ తగ్గిస్తుందని నిపుణులు సూచించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి