AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: వాముతో కిడ్నీలో రాళ్లను కరిగించవచ్చా? ఇంకా ఎన్ని లాభాలో!!

వంటింట్లో ఉండే పదార్థాలే మన అనారోగ్యాలకు ఔషధాలు. అందుకే పెద్దలు ఊరికే అనలేదు.. వంటిల్లే వైద్య శాల అని వంటింట్లో ఉండే వాటితో అనారోగ్యాలను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజు వాము వాడటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలేంటి ? ఏయే అనారోగ్యానికి వామును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. వాములో అనేకరకాల విటమిన్లు, మినరల్స్, పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వాములో ఉండే ఒకరకమైన రసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరచడంలో..

Kitchen Hacks: వాముతో కిడ్నీలో రాళ్లను కరిగించవచ్చా? ఇంకా ఎన్ని లాభాలో!!
Amazing Health Benefits Of Ajwain
Chinni Enni
|

Updated on: Aug 14, 2023 | 3:20 PM

Share

వంటింట్లో ఉండే పదార్థాలే మన అనారోగ్యాలకు ఔషధాలు. అందుకే పెద్దలు ఊరికే అనలేదు.. వంటిల్లే వైద్య శాల అని వంటింట్లో ఉండే వాటితో అనారోగ్యాలను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజు వాము వాడటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలేంటి ? ఏయే అనారోగ్యానికి వామును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. వాములో అనేకరకాల విటమిన్లు, మినరల్స్, పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వాములో ఉండే ఒకరకమైన రసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. వాములో ఉండే థైమల్ అనే రసాయనం బ్యాక్టీరియా, ఫంగల్ వ్యాధులను నిరోధిస్తుంది. తలనొప్పి, అలసట, జలుబు, మైగ్రేన్ వంటి వాటికి వాము మందులా పనిచేస్తుంది.

ఆకలి వేస్తుంది: గర్భిణీ స్త్రీలు ఆకలిగా లేనప్పుడు వాము తింటే.. వెంటనే ఆకలి కలుగుతుంది. అలాగో గర్భాశయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

కడుపు నొప్పి మాయం: కడుపునొప్పితో బాధపడేవారు కూడా వామును బాగా నమిలి తిని, మంచినీరు తాగితే.. వెంటనే తగ్గుతుంది. వామును దోరగా వేయించి పొడిచేసి నిల్వచేసుకోవాలి. ఈ పొడిని రోజూ అన్నంలో ఒక ముద్దలో కలిపి తింటే అజీర్తి తగ్గి ఆకలి పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

నోటి సమస్యలకు చెక్: వామునీటిని పుక్కిలి పడితే పంటినొప్పి, చిగుళ్ల వాపులు తగ్గుతాయి.

కిడ్నీలో రాళ్లు ఉండవు: వామును తేనెతో కలిపి క్రమం తప్పకుండా 10-15 రోజులపాటు తింటే.. కిడ్నీల్లో రాళ్లు కూడా కరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలకు మంచిది: ఒక గ్లాసు నీటిలో వాము, శొంఠిపొడి వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడగట్టి ఒక గ్లాసులోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసిన వామువాటర్ ను రోజుకు రెండుపూటలా పిల్లల చేత టీ గ్లాసు మోతాదులో తాగిస్తే.. జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.

స్కిన్ అలర్జీ తగ్గుతుంది: టీ స్పూన్ వాముపొడిని బెల్లంతో కలిపి తింటే.. చర్మంపై వచ్చే అలర్జీలు తగ్గుతాయి.

టాన్సిల్ తగ్గుతాయి: వామును నోటిలో వేసుకుని.. ఆ రసాన్ని కొద్దికొద్దిగా మింగుతూ ఉంటే.. వర్షాకాలం, శీతాకాలంలో వచ్చే టాన్సిల్స్ (గవదబిళ్లలు) వాపులు తగ్గుతాయి.

అంతేకాకుండా ప్రతిరోజూ వామును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి