Papaya Chutney: పచ్చి బొప్పాయితో చట్నీ ఎలా చేయాలో మీకు తెల్సా..? టేస్ట్ సూపర్ అంతే

బొప్పాయి చట్నీ, బెంగాలీ ప్రజల ప్రసిద్ధ వంటకం. రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి మంచిది. బొప్పాయి చట్నీకి రోగనిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా చేయాలి? ఏంటి అనేది తెలుసుకుందాం పదండి. అలానే బొప్పాయి ఎలా అయినా సరే మీ డైట్‌లో ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే దీని వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా ప్లేట్‌లెట్స్ కౌంట్ బాగా పెరుగుతుంది. ఇంకా ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం..

Papaya Chutney: పచ్చి బొప్పాయితో చట్నీ ఎలా చేయాలో మీకు తెల్సా..? టేస్ట్ సూపర్ అంతే
Papaya Chutney
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 14, 2023 | 4:37 PM

బొప్పాయి ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్లేట్‌లెట్స్ సంఖ్యను పెంచడం దగ్గర్నుంచి దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పచ్చి బొప్పాయి కాయలతో పచ్చడి చేస్తారన్న సంగతి మీకు తెలుసా..? అవునండీ నిజం. ఈ చట్నీ నిజానికి బెంగాలీ ప్రజల ప్రసిద్ధ వంటకం కూడా. ఇది రుచిగా కూడా ఉంటుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా మంచిది. పచ్చి బొప్పాయి, చక్కెర, ఉప్పు,  కొన్ని ప్రత్యేక మసాలా దినుసులతో దీన్ని తయారు చేస్తారు. ఈ ప్రత్యేక చట్నీని పెద్ద పెద్ద ఈవెంట్‌లు, పండుగల సందర్భంగా పెడుతుంటారు. అయితే దీన్ని ఎలా చేయాలి..? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

అవసరమైన పదార్థాలు:

1/2 కప్పు తరిగిన పచ్చి బొప్పాయి

1/2 కప్పు చక్కెర

తగినంత ఉప్పు

1/2 టీస్పూన్ నిమ్మరసం

1/2 కప్పు నీరు

1/2 టేబుల్ స్పూన్ నెయ్యి

యాలకులు 2

1/2 స్పూన్ నల్ల జీలకర్ర

కుంకుమపువ్వు

జీడిపప్పు తగినంత

బొప్పాయి చట్నీ ఎలా చేయాలి?

1. ముందుగా ఒక పచ్చి బొప్పాయిని తీసుకుని, గింజలను తీసివేసి సన్నగా తురమాలి

2. ఆ తురిమిన బొప్పాయిని ఒక గిన్నె నీటిలో వేసి సుమారు 10-15 నిమిషాలు నానబెట్టండి. ఈ విధానాన్ని 2-3 సార్లు పునరావృతం చేయండి, ఆపై నీటి నుండి తొలగించండి.

3. తర్వాత ఒక పాత్రలో కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. నానబెట్టిన బొప్పాయి ముక్కలను అందులో వేయాలి. తర్వాత రెండు నిమిషాలు బాగా వేయించాలి. తర్వాత నీళ్లు పోసి మరిగించాలి. తర్వాత అందులో పంచదార, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి.

4. ఆ తర్వాత మీరు కొంచెం నిమ్మరసం జోడించవచ్చు. తరువాత, యాలకులు, కలోంజి గింజలు (కాలా జీర సీడ్), అవసరమైనంత ఉప్పు వేయండి.

5. వీటన్నింటిని కలిపిన తర్వాత బాగా ఉడికించాలి. పైన వేయించిన జీడిపప్పును చల్లితే బొప్పాయి చట్నీ తినేందుకు రెడీ అయినట్లే.

బొప్పాయి వల్ల ప్రయోజలనాలు ఇప్పుడు తెలుసుకుందాం

  1. బొప్పాయి తినడం వల్ల శరీరానికి కావాల్సిన మెగ్నిషియం, కాపర్‌, పొటాషియం లభిస్తాయి
  2. బొప్పాయిలో క్యాన్సర్‌ను నిరోధించే యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి
  3. కిడ్నీలో రాళ్లకు చెక్ పెట్టవచ్చు
  4. బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉంటాయి. విటమిన్‌ ఇ సమృద్ధిగా లభిస్తుంది
  5. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెకు మేలు చేస్తుంది
  6. బొప్పాయి కళ్లకు కూడా ఎంతో మంచిది
  7. ఇది అల్జీమర్స్ వ్యాధితో పోరాడడంలో కూడా సహాయం చేస్తుంది.
  8. రెగ్యులర్‌ బొప్పాయి తీసుకుంటే ఎముకలు ధృడంగా తయారవుతాయి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి