AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Don’t Eat These Foods: శృంగారం చేసిన తర్వాత ఈ ఫుడ్స్ తింటున్నారా.. చాలా డేంజర్!!

శృంగారం జీవన విధానంలో ఒక భాగం. శృంగారం గురించి చాలా విషయాలు తెలుసుకోవడంలో తప్పు లేదు. శృంగారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శృంగారం చేసిన తర్వాత కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. మనకు తెలీకుండా కొన్ని ఆహార పదార్థాలను తినేస్తాం. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. శృంగారం చేసిన తర్వాత కేలరీలు బాగా ఖర్చు అవుతాయి. బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. వ్యాయామం చేసిన తర్వాత ఎలా..

Don't Eat These Foods: శృంగారం చేసిన తర్వాత ఈ ఫుడ్స్ తింటున్నారా.. చాలా డేంజర్!!
Pizza
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 10, 2023 | 8:00 AM

Share

శృంగారం జీవన విధానంలో ఒక భాగం. శృంగారం గురించి చాలా విషయాలు తెలుసుకోవడంలో తప్పు లేదు. శృంగారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శృంగారం చేసిన తర్వాత కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. మనకు తెలీకుండా కొన్ని ఆహార పదార్థాలను తినేస్తాం. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.

కోడి గుడ్డు:

శృంగారం చేసిన తర్వాత కేలరీలు బాగా ఖర్చు అవుతాయి. బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. వ్యాయామం చేసిన తర్వాత ఎలా ఆకలి వేస్తుందో.. శృంగారం చేసిన తర్వాత కూడా ఆకలి వేస్తుంది. దీంతో ఏమైనా తినాలి అనిపిస్తుంది. అలాగని కోడి గుడ్లు తినకూడదు. ఇందులో ప్రోటీన్, మంచి కొవ్వులు ఎక్కువగా ఉంటుయి. కాబట్టి అరుగుదల అవ్వదు. శృంగారం తర్వాత వీటికి దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

పిజ్జా:

శృంగారంలో పాల్గొన్న తర్వాత పిజ్జా వంటి హై కేలరీ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. ఇది జీర్ణం కావడానికి కొంచెం కష్టం ఉంటుంది. శృంగారం తర్వాత పిండి, చీజ్ వంటి పదార్థాలు తింటే.. చికాకును కలిగించడమే కాకుండా అజీర్తి ఫీలింగ్ ని కలుగుచేస్తాయి.

టీ-కాఫీ:

శృంగారం చేసిన తర్వాత టీ, కాఫీలకు దూరంగా ఉండటం కూడా చాలా బెటర్. ఎందుకంటే వీటిల్లో కెఫీన్ ఉంటుంది కాబట్టి.. శృంగారం చేశాక వీటిని తాగితే.. చికాకుతో పాటు కడుపులో సమస్యలు కూడా తలెత్తుతాయి. శృంగారం తర్వాత రక్త ప్రసరణ పెరుగుతుంది.. ఆ సమయంలో కాఫీ, టీలకు దూరంగా ఉంటే చాలా బెటర్.

బ్రెడ్:

బ్రెడ్ కూడా శృంగారం చేశాన తినకూడదు. శృంగారంలో పాల్గొన్న తర్వాత ఇది తింటే గ్యాస్, కడుపులో ఉబ్బరం, తిమ్మిరిగా ఉండటం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. బ్రెడ్ కూడా అంత సులువుగా జీర్ణం కాదు.

ఆల్కాహాల్:

శృంగారం చేసిన తర్వాత కానీ, ముందు కానీ ఆల్కాహాల్ కి వీలైనంత వరకూ దూరంగా ఉంటేనే హెల్త్ కి చాలా మంచిది. శృంగారం చేసిన రక్త ప్రసరణ వేగంగా ఉంటుంది కాబట్టి.. అలాంటి సమయంలో ఆల్కాహాల్ అస్సలు తాగకూడదు. మత్తుగా, చికాకుగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకూ పైన చెప్పిన పదార్థలన్నింటికీ దూరంగా ఉంటే బెటర్.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి