Children Sitting Position: మీ పిల్లలు ఇలా కూర్చుంటున్నారా! అయితే జాగ్రత్త.. నిజాలు తెలుసుకోండి!
పిల్లలు కూర్చునే విధానం బట్టి కూడా వారి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న విషయం తెలుసా. చిన్న పిల్లలు ఏం చేసినా ముద్దగానే ఉంటుంది. వాళ్లు తెలిసీ తెలియని తనంలో ఏదో చేస్తూంటారు. వారిని మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. చిన్న పిల్లలు చేసేది ముద్దుగానే ఉంటుంది. కానీ కొన్ని సార్లు అదే అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. కాబట్టి ఇది తప్పు అంటూ వారికి చెబుతూ ఉండాలి. పిల్లలు కూడా మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటారు. పిల్లలు చేసే పనిలో కూర్చోవడం కూడా ఒకటి. ఒక్కొక్కరు ఒక్కోలా కూర్చుంటారు. వీరిలో కొంత మంది పెద్దలు కూర్చొబెట్టినట్టు కూర్చొంటారు. చాలా మంది పిల్లలు W..
పిల్లలు కూర్చునే విధానం బట్టి కూడా వారి ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న విషయం తెలుసా. చిన్న పిల్లలు ఏం చేసినా ముద్దగానే ఉంటుంది. వాళ్లు తెలిసీ తెలియని తనంలో ఏదో చేస్తూంటారు. వారిని మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. చిన్న పిల్లలు చేసేది ముద్దుగానే ఉంటుంది. కానీ కొన్ని సార్లు అదే అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. కాబట్టి ఇది తప్పు అంటూ వారికి చెబుతూ ఉండాలి. పిల్లలు కూడా మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటారు. పిల్లలు చేసే పనిలో కూర్చోవడం కూడా ఒకటి. ఒక్కొక్కరు ఒక్కోలా కూర్చుంటారు. వీరిలో కొంత మంది పెద్దలు కూర్చొబెట్టినట్టు కూర్చొంటారు. చాలా మంది పిల్లలు W ఆకారంలో కూర్చొని ఉంటారు. కానీ ఇలా కూర్చొవడం వల్ల పిల్లలు అనారోగ్య సమస్యలకు గురవుతారన్న విషయం పెద్దలకు తెలీదు. ఇది మనకు కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది.
పిల్లలకు ఎలా పడితే అలా కూర్చోవడానికి, నడవడానికి కండరాల్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కానీ పెద్దలకు అలా ఉండదు. నిజానికి పిల్లలు ఇలా W ఆకారంలో కూర్చోకూడదు. అలా పిల్లలు కూర్చుంటే.. కూర్చోవద్దని చెప్పాలి. చాలా మంది పిల్లలు ఇలా గంటలు గంటల తరబడి కూర్చుంటారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. ఇలా కూర్చుంటే వారి శరీర ఆకృతి మారడమే కాకుండా.. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
– ఈ భంగిమలో కూర్చోవడం వల్ల శరీర ఆకృతి మారుతుంది – కండరాలు బలపడవు. ఇలా కూర్చుంటే కండరాలు వంకరగా మారతాయి. – వెన్నుముక కండరాలు బలహీన పడతాయి. – ఈ ఆకారంలో కూర్చొన్న పిల్లలకు ఎముకలకు సంబంధించిన వ్యాధులు, వెన్ను నొప్పి, యాంటీరియర్ క్రూసియేట్ లిగ్మెంట్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. – ఈ పిల్లలకు ఎదుగుదల కూడా ఉండదు. – వెన్ను బలహీనత, కండరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. – అలాగే మస్తిష్క పక్షవాతం, తొడ కండరాల్లో సమస్యలు ఉన్న పిల్లలు మెదడు అభివృద్ధి మందగించిన పిల్లలు ఇలా W ఆకారంలో కూర్చుంటారని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి