AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rosemary Benefits: ఈ హెర్బ్స్ ని ఆహారంలో చేర్చుకోండి.. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది!

ఇప్పుడున్న కాలంలో అందరూ తొందరగా జబ్బులకు గురవుతూ ఉంటున్నారు. దీనికి కారణం.. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడమే. మన బాడీలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటేనే.. వ్యాధులు కూడా తొందరగా మన చెంతకు రాకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం నడుస్తోంది. అసలే ఈ సీజన్ లో వ్యాధులు చుట్టుముడతాయి. దీంతో శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంలో రోజ్మేరీ బాగా వర్క్ చేస్తుంది. ఇది మంచి సువాసనతో కూడిన అద్భుతమైన మూలిక. దీన్ని ముఖ్యంగా ఔషధాల్లో, వంటల్లో కూడా..

Rosemary Benefits: ఈ హెర్బ్స్ ని ఆహారంలో చేర్చుకోండి.. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది!
Rosemary Benefits
Chinni Enni
|

Updated on: Sep 10, 2023 | 1:23 PM

Share

ఇప్పుడున్న కాలంలో అందరూ తొందరగా జబ్బులకు గురవుతూ ఉంటున్నారు. దీనికి కారణం.. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడమే. మన బాడీలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటేనే.. వ్యాధులు కూడా తొందరగా మన చెంతకు రాకుండా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం నడుస్తోంది. అసలే ఈ సీజన్ లో వ్యాధులు చుట్టుముడతాయి. దీంతో శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంలో రోజ్మేరీ బాగా వర్క్ చేస్తుంది. ఇది మంచి సువాసనతో కూడిన అద్భుతమైన మూలిక. దీన్ని ముఖ్యంగా ఔషధాల్లో, వంటల్లో కూడా ఉపయోగిస్తూంటారు. క్యాన్సర్ రాకుండా చూడటంలో ఇది బాగా వర్క్ చేస్తుంది. ప్రస్తుతం రోజ్మేరీ పలు నగరాల్లో విరివిగా దొరుకుతుంది. రోజ్మెరీలో కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి రోజ్మేరీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

ఏకాగ్రతను పెంచుతుంది:

రోజ్మేరీని క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటే.. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగు పరుస్తుంది. అలాగే అభిజ్ఞా క్షీణత ఉన్న విద్యార్థులకు, వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మెండుగా యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు:

రోజ్మేరీలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. దీంతో ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. అంతే కాకుండా క్యాన్సర్, గుండె సమస్యలు వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల ముప్పును తగ్గించడానికి కూడా రోజ్మేరీ సహాయ పడుతుంది.

జీర్ణ క్రియకు మేలు చేస్తుంది:

తరచూ రోజ్మేరీని వాడటం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. అలాగే కడుపులో మంట, ఉబ్బరం, నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.

శ్వాసకోశ ఆరోగ్యంగా ఉంటుంది:

రోజ్మేరీలో ఉండే కొన్ని రకాల నూనెలు ఎక్స్ పెక్టరెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీంతో శ్వాసకోశ సమస్యలు రాకుండా హెల్ప్ చేస్తుంది. ఉన్న వాటిని కూడా అదుపులో ఉంచుతుంది. శ్వాస కోశంలో ఉండే శ్లేష్మాన్ని, జలుబు, దగ్గును రాకుండా సహాయ పడుతుంది.

ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది:

రోజ్మేరీ ఉత్సాహంగా ఉండేలా కూడా చేస్తుంది. ఒత్తిడి, ఆందోళనలకు గురవుతున్న వారు రోజ్మేరీని తీసుకుంటూ ఉంటే.. మానసిక స్థితి మెరుగు పడుతుంది. రోజ్మేరీ కలిపిన టీ తీసుకున్నా, ఆహారం తీసుకున్నా నిరాశ దరి చేరకుండా చేస్తుంది.

చర్మాన్ని హెల్దీగా ఉంచుతుంది:

రోజ్మేరీలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా చర్మం కూడా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి