AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Anklets Improve Health: వెండి పట్టీలు ధరించడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?

కాళ్లకు పట్టీలు లేకుండా ఏ అమ్మాయిని చూడలేము అనే చెప్పాలి. మహిళల తమ కాళ్లకు పట్టిలు పెట్టుకుంటే మరింద అందంగా కనిపిస్తారు. అందెల సవ్వడి అంటూ కొన్ని సినిమాల్లో పాటలే ఉన్నాయి. కాళ్ల పట్టీలపై కవిత్వాలు, పాటలు ఎన్నో వచ్చాయి. అంత అందాన్ని ఇస్తాయి కాబట్టే పట్టీలను అమ్మాయిలు ధరిస్తారు. సంప్రదాయ దుస్తులు ధరించి, గల్లు గల్లుమనే పట్టీలను ధరించి అలా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ప్రతి ఒక్కరి చూపు ఆ మువ్వల సవ్వడిపైనే ఉంటుంది.

Silver Anklets Improve Health: వెండి పట్టీలు ధరించడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?
Silver Anklets
Shiva Prajapati
|

Updated on: Sep 10, 2023 | 10:04 AM

Share

కాళ్లకు పట్టీలు లేకుండా ఏ అమ్మాయిని చూడలేము అనే చెప్పాలి. మహిళల తమ కాళ్లకు పట్టిలు పెట్టుకుంటే మరింద అందంగా కనిపిస్తారు. అందెల సవ్వడి అంటూ కొన్ని సినిమాల్లో పాటలే ఉన్నాయి. కాళ్ల పట్టీలపై కవిత్వాలు, పాటలు ఎన్నో వచ్చాయి. అంత అందాన్ని ఇస్తాయి కాబట్టే పట్టీలను అమ్మాయిలు ధరిస్తారు. సంప్రదాయ దుస్తులు ధరించి, గల్లు గల్లుమనే పట్టీలను ధరించి అలా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ప్రతి ఒక్కరి చూపు ఆ మువ్వల సవ్వడిపైనే ఉంటుంది. అయితే, కాళ్లకు పట్టీలు ధరించడం వలన అందం పెరగడం మాత్రమే.. శాస్త్రీయపరమైన ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి. అందెలు ధరించడం వలన అందంతో పాటు.. ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఆ మువ్వల సవ్వడి సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుందట.

అమ్మాయిలు పట్టీలను ధరించడం వలన కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్లు ఒత్తడికి గురవుతాయి. తద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. వెండిలోని లక్షణాలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచుతాయి. పాదాలకు పట్టీలుకు ధరించడం కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాళ్ల నొప్పి నుంచి ఉపశమనం..

అధిక శ్రమలో కూడిన జీవనశైలి కారణంగా.. మహిళలు తరచుగా వారి కాళ్ళలో నొప్పి అనుభవిస్తారు. అలాంటి పరిస్థితిలో.. పట్టీలు ధరించడం ఉపయోకరంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. పట్టీలు ధరించడం వల్ల ఈ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందట. శారీరక బలహీనతను తొలగిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

మడమల వాపు తగ్గిస్తుంది..

కొన్నిసార్లు హైహీల్స్ ధరించడం వల్ల మడమలు వాచిపోతాయి. దీనివల్ల కాళ్లలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కాలి వేళ్లలో నొప్పి ఉంటుంది. అయితే, పట్టీలు ధరించినప్పుడు అది రక్త ప్రసరణ మెరుగవడానికి కారణం అవుతుంది. తద్వారా పాదాల వాపును తగ్గిస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ మెరుగవుతుంది..

ఆహారం తినడం ద్వారా మాత్రమే కాదు, పట్టీలు ధరించడం వలన కూడా రోగనిరోధక శక్తి బలపడుతుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇది శోషరస గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. తద్వారా వ్యాదుల బారిన పడకుండా కాపాడుతుంది.

హార్మోన్ల సమతుల్యత కోసం..

చాలా మంది మహిళలు హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఇబ్బంది పడుతున్నారు. దీని కారణంగా, వంధ్యత్వం, క్రమరహిత పీరియడ్స్ వంటి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో.. వెండి పట్టీలు ధరించడం వలన ప్రయోజనం ఉంటుంది. ఇవి హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో దోహదపడుతుంది.

శరీర ఉష్ణోగ్రత..

వెండి పట్టీలు ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో కూడా సహాయపడుతుంది.

మెరుగైన రక్త ప్రసరణ కోసం..

పట్టీలను ధరించడం వలన ముఖ్యమైన పాయింట్లలో ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా శరీరంలో వైబ్రేషన్ వస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పట్టీలు ధరించడం వల్ల శరీర నొప్పులు కూడా తగ్గుతాయి.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..