Hyderabad: మావోయిస్ట్ లీడర్ దీపక్‌రావు అరెస్ట్.. చికిత్స పొందుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు..
Telangana: తమిళనాడు, కేరళ, కర్ణాటక ట్రైజోన్, పశ్చిమ ఘాట్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న దీపక్‌ను హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కేరళ అడవుల్లో నిర్వహించిన ఆపరేషన్‌లో దీపక్ రావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీపక్ రావు భార్యను కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కేరళలో దీపక్ రావును అలియాస్ అనిల్, వికాస్ పేర్లతో..
తెలంగాణ, సెప్టెంబర్ 16: మావోయిస్టులకు తెలంగాణ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. పోలీసుల అదుపులో ప్రస్తుతం ట్రైజోన్ కమిటీ కార్యదర్శి సంజయ్ దీపక్ రావు ఉన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఇతనిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. దీంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న దీపక్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు దీపక్ రావుకు జమ్మూ కాశ్మీర్‌లో సపెరిటీస్ట్ గ్రూప్‌తో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక ట్రైజోన్, పశ్చిమ ఘాట్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న దీపక్‌ను హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కేరళ అడవుల్లో నిర్వహించిన ఆపరేషన్‌లో దీపక్ రావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీపక్ రావు భార్యను కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కేరళలో దీపక్ రావును తన పేరుతో కాకుండా అనిల్, వికాస్ పేర్లతో పిలుస్తుంటారని తెలుస్తోంది.
మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్ నాథ్‌కు చెందిన దీపక్ రావు.. గతంలో రెండు సార్లు అరెస్ట్ అయ్యాడు. ధూలే, బెంగళూరులోనూ అరెస్టయి జైలుకూ వెళ్లొచ్చాడు. చాలా కాలం మహారాష్ట్రలో పనిచేసిన దీపక్ రావు 2019లో పాలకాడ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత మణివాసగం మృతి తర్వాత 2020 నుంచి పశ్చిమ ఘాట్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తూ వస్తున్నాడు. అరెస్ట్ చేసిన సంజయ్ దీపక్‌ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ మావోయిస్టు సంజయ్ దీపక్ రావుని అరెస్ట్ చేశామని అన్నారు. మాధాపూర్‌లో ఉంటున్న ఫిల్మ్ ఎడిటర్, మలేషియన్ టౌన్షిప్‌లో ఉంటున్న ఇంకొందరు ఇతనికి సహకరిస్తున్నారని చెబుతున్నారు. గత 2000 సంవత్సరం మహారాష్ట్రలో మొదటగా అరెస్ట్ అయ్యాడని, జైల్‌కి వెళ్లి వచ్చిన తర్వాత మళ్ళీ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నాడని డీజీపీ చెపుకొచ్చారు. మవోయిస్టు సంజయ్ దీపక్ రావు దగ్గరి నుంచి ఒక పిస్టల్, ఆరు రౌండ్స్ బుల్లెట్స్, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..