Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: భాగ్యనగర వాసులకు శుభవార్త.. రెండో విడత డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీ ముహూర్తం ఖరారు.. వివరాలివే..

Hyderabad: జీచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో రెండో విడతగా 11,700 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లుగా మంత్రి తెలిపారు. రెండో విడత ప్రక్రియలో దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ కల్పించామన్నారు. దివ్యాంగులకు 470, ఎస్సీలకు 1,923, ఎస్టీలకు ఎస్టీలకు 655 కేటాయించగా.. ఇతరులకు 8,652 కేటాయించినట్లు వివరించారు.

Hyderabad: భాగ్యనగర వాసులకు శుభవార్త.. రెండో విడత డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీ ముహూర్తం ఖరారు.. వివరాలివే..
Double Bed Rooms
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 16, 2023 | 7:01 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 16: హైదరాబాద్‌లో రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న రెండో విడతలో భాగంగా 13 వేల 3 వందల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ తెలిపారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతోనే వారికి డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఉచితంగా అందజేస్తుందని మంత్రి తలసాని ఈ సందర్భంగా అన్నారు. జీచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో రెండో విడతగా 11,700 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లుగా మంత్రి తెలిపారు. రెండో విడత ప్రక్రియలో దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ కల్పించామన్నారు. దివ్యాంగులకు 470, ఎస్సీలకు 1,923, ఎస్టీలకు ఎస్టీలకు 655 కేటాయించగా.. ఇతరులకు 8,652 కేటాయించినట్లు వివరించారు.

కేటాయింపులో ఎలాంటి ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇళ్లు రాని వారు ఏలాంటి భయాందోళనలు పడొద్దని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి అన్నారు. పేద, మధ్య తరగతి వారు ఎంతో గొప్పగా బ్రతకాలని ఉద్దేశంతో ఖరీదైన ప్రాంతాలలో ఇల్లు కట్టించి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ఇండ్లను కట్టి ఇచ్చిన దాఖలాలు లేవని.. ఢిల్లీలోని ఐఏఎస్, ఐపీఎస్‌ల క్వార్టర్స్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఇక్కడి డబుల్ బెడ్ రూమ్‌లు ఉన్నాయని మాజీ గవర్నర్ నరసింహన్ చెప్పారన్నారు. ఈ నెల 21వ తేదీన 2బీహెచ్‌కే పంపిణీ ఉంటుందని తెలిపారు.

కాగా, లబ్ధిదారుల అడ్రస్ మారితే వారు ఇది వరకు ఇచ్చిన అడ్రస్ కు సమాచారం ఇస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన రెండవ విడత డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు డ్రా కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..