Skincare Tips: మెరిసే చర్మం కావాలా..? ఈ ఆహారాలను తింటే మెరిసే మేని ఛాయ మీ సొంతం.. మొటిమలు, మచ్చలు కూడా మాయం..

Skincare Tips: జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం వంటి పలు కారణాలతో ప్రస్తుతం చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీటిల్లో చర్మ సమస్యలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో అయినా జాగ్రత్త పడకుండా ఉంటారు కానీ చర్మం విషయంలో నానా ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు. అలాంటి వారు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల మెరిసే చర్మంతో పాటు ఆహారాన్ని కూడా పెంపొందించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అందుకోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 14, 2023 | 2:00 PM

పోషకాలతో కూడిన ఆహారాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆ క్రమంలోనే చర్మం కూడా మెరిసిపోతుంది. అందుకోసం మీరు నిత్యం కొన్ని ఆహారాలను తీసుకోవాలి.

1 / 5
క్యారెట్: చర్మానికి మేలు చేసే ఆహారాల్లో క్యారెట్ కూడా ప్రముఖమైనది. దీనిలోని పోషకాలు చర్మ సమస్యలను తగ్గించడంలో పనిచేస్తాయి. దీన్ని మీరు నేరుగానే తీసుకోవచ్చు.

2 / 5
దోసకాయ: నిత్యం తీసుకునే ఆహారంలో దోసకాయ ఉంటే చర్మ సమస్యలు మీ దరికే చేరవు. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉన్నందున మీ చర్మం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

3 / 5
కొబ్బరి నీరు: కొబ్బరినీరులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడడంలో పనిచేస్తుండగా.. విటమిన్ ఇ చర్మ, కేశ సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫలితంగా మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

4 / 5
నిమ్మకాయ: చర్మ సమస్యలను నివారించడంలో నిమ్మకాయకు ప్రముఖ స్థానం ఉంది. దీనిలోని విటమిన్ సి, విటమిన్ ఇ చర్మం మెరిసేలా చేయడంతో పాటు మొటిమలు, మచ్చలను తొలగిస్తాయి.

5 / 5
Follow us